జలవనరుల శాఖలో పదోన్నతులు
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:40 AM
జలవనరుల శాఖలో పలువురు ఎస్‌ఈలకు చీఫ్ ఇంజనీర్లు (సీఈ)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలో ఇద్దరు ఎస్‌ఈలకు సీఈగా ప్రమోషన
కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈగా కబీర్ బాషా రెగ్యులర్ పోస్టింగ్
తిరుపతి టీడీపీ సీఈగా వరప్రసాద్ పదోన్నతిపై బదిలీ
్జకర్నూలు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): జలవనరుల శాఖలో పలువురు ఎస్‌ఈలకు చీఫ్ ఇంజనీర్లు (సీఈ)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఇద్దరు ఎస్‌ఈలు పదోన్నతి పొందారు. కర్నూలు జలవనరుల శాఖ ప్రాజెక్టు సీఈ అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) చూస్తున్న నంద్యాల ఎనఆర్‌బీసీ-1 సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) షేక్ కబీర్ బాషాను సీఈగా పదోన్నతి ఇస్తూ ఇక్కడే రెగ్యులర్ పోస్టింగ్ కల్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. 1992లో ఏఈఈగా ఉద్యోగంలో చేరి నాగార్జునసాగర్ డ్యాంలో విధుల్లో చేరారు. 2006లో డీఈఈగా పదోన్నతిపై వినుకొండ క్వాలిటీ కంట్రోల్ డివిజనలో చేరారు. 2019లో ఈఈగా... 2020 మేలో ఎస్‌ఈగా పదోన్నతి ఇచ్చారు. ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్-1 ఎస్‌ఈగా పని చేస్తూ.. 2020 నుంచి కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈగా ఇనచార్జిగా కొనసాగుతున్నారు. సీఈగా పదోన్నతి ఇవ్వడమే కాకుండా అదే పోస్టులో రెగ్యులర్ చేశారు.
ఫ తిరుపతి టీజీపీ సీఈగా వరప్రసాద్
హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈగా పని చేస్తున్న ఎంఎల్‌ఎన వరప్రసాద్‌కు ప్రభుత్వం సీఈగా పదోన్నతి కల్పించింది. తిరుపతి తెలుగుగంగ ప్రాజెక్టు సీఈగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వరప్రసాద్ ఏఈఈ నుంచి ఎస్‌ఈ వరకు వివిధ హోదాల్లో ఆయా ప్రాజెక్టుల్లో పని చేశారు. సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఏఈఈ ఉద్యోగంలో చేరారు. నంద్యాల టీజీపీలో తొలిసారిగా ఉద్యోగంలో చేరిన ఆయన 2002లో పదోన్నతిపై నందికొట్కూరు ఏబీఆర్ డివిజన డీఈఈగా బాధ్యతలు చేపట్టారు. 2016లో పదోన్నతిపై ఎస్‌ఆర్‌బీసీ పాణ్యం ఈఈగా, ఇనచార్జిగా ఎస్‌ఈగా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో ఎస్‌ఈగా పదోన్నతిపై హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రెండు నెలలు గడవకనే సీఈగా పదోన్నతిపై తిరుపతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.