హాస్టళ్లలో క్రీడలకు ప్రోత్సాహం: సవిత, డోలా
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:17 AM
బీసీ, ఎస్సీ విద్యా సంస్థల్లో క్రీడలను ప్రోత్సహిస్తామని ఆ శాఖల మంత్రులు సవిత, డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు.
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): బీసీ, ఎస్సీ విద్యా సంస్థల్లో క్రీడలను ప్రోత్సహిస్తామని ఆ శాఖల మంత్రులు సవిత, డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. శాప్ చైర్మన్ రవినాయుడు గురువారం సచివాలయంలో మంత్రులిద్దరితో భేటీ అయ్యారు. అనంతరం మంత్రులు వేరు వేరుగా మీడియాతో మాట్లాడారు. క్రీడల్లో బీసీ హాస్టళ్ల విద్యార్థులు రాణించేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి సవిత తెలిపారు. శాప్ సహకారమందిస్తే దేశం గర్వించే క్రీడాకారులను అందించే అవకాశం కలుగుతుందన్నారు. ఇండోర్, ఔట్‌డోర్ స్పోర్ట్స్ కిట్లు అందజేయాలన్నారు. ఎస్సీ హాస్టళ్ల విద్యార్థులు, బీఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల్ని క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఆయా ప్రాంగణాల్లో క్రీడా వసతుల కల్పనకు ఎస్సీ కాంపోనెంట్ నిధులు కేటాయించాలని రవినాయుడు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News