సీనియర్ అసిస్టెంట్లకు ఏవోలుగా పదోన్నతి
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:46 PM
జిల్లా పరిషత పరిధిలో పని చేస్తున్న ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనా అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ జడ్పీ సీఈవో నాసరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కర్నూలు న్యూసిటి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత పరిధిలో పని చేస్తున్న ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనా అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ జడ్పీ సీఈవో నాసరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి చేతుల మీదుగా పరిపాలనా అధికారులు నియామక పత్రాలను అందుకున్నారు. కర్నూలు పీఐయూ డివిజనలో పని చేస్తున్న ఎన. భాగ్యలక్ష్మిని ప్యాపిలి పరిపాలన అధికారిగా పీఆర్ డివిజన ఆదోనిలో పని చేస్తున్న ఎం. నాగరాజు స్వామి, పెద్దకడుబూరు ఎంపీడీవో, పీఆర్ డివిజన నంద్యాలలో పని చేస్తున్న భరణి కుమారిని ఎంపీడీవో కోవెలకుంట్ల, కర్నూలు పీఆర్‌ఐ డివిజనలో పని చేస్తున్న ఎంజీ నాగేంద్ర కుమార్‌ను పగిడ్యాల ఎంపీడీవో, మిడ్తూరు ఎంపీడీవోగా పని చేస్తున్న శ్రీరాములు అవుకు ఎంపీడీవో, ఆత్మకూరు పీఐయూ సబ్ డివిజనలో పని చేస్తున్న అబ్దుల్ కలాంబాషాను ఎంపీడీవో డోన, ఆదోని పీఐయూ సబ్ డివిజనలో పని చేస్తున్న రవీంద్రబాబును ఎంపీడీవో హాలహర్వి, కల్లూరు ఎంపీడీవోలో పని చేస్తున్న ఎస్. హేమలతను కర్నూలు డ్వామా కార్యాలయంలో నియమిస్తూ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.