Share News

సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:49 PM

అంగనవాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, ఏపీ అంగనవాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన జిల్లా అధ్యక్షురాలు షేభా రాణి అన్నారు.

సమస్యలు పరిష్కరించాలి
డోనలో ధర్నా చేస్తున్న అంగనవాడీలు, సీఐటీయూ నాయకులు

నిరసన వ్యక్తం చేసిన అంగనవాడీ కార్యకర్తలు

డోన టౌన, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): అంగనవాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, ఏపీ అంగనవాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన జిల్లా అధ్యక్షురాలు షేభా రాణి, సీఐటీయూ పట్టణ, మండల కార్యదర్శులు రామాంజనేయులు, నక్కి శ్రీకాంత అన్నారు. సోమవారం పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాల యం వద్ద ధర్నా చేశారు. అనంతరం సీడీపీవో శంషాద్‌బేగంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగనవాడీ ల సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే టీడీపీ కి తప్పదన్నారు. కార్యక్రమంలో గుల్జార్‌, అనూష, సుమలత, శ్రీలక్ష్మి, రాజేశ్వరి, వరలక్ష్మి, సుబ్బలక్ష్మి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

బనగానపల్లెలో..

బనగానపల్లె: తమ డిమాండ్లు నెరవేర్చాలని బనగానపల్లె ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద ఐదు మండలాల అంగనవాడీ కార్యాకర్తలు సోమవార ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, మినీ అంగనవాడీ కేంద్రాలను మెయిన కేంద్రాలుగా మార్చాలని, హెల్ప ర్ల ప్రమోషన్లు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అంగనవాడీ కార్యకర్తలకు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని, సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ అధికారి ఉమా మహేశ్వరమ్మకు అంగనవాడీలు వినతిపత్రం సమర్పించారు. కార్యక్ర మంలో జిల్లా అంగనవాడీ కార్యకర్తల నాయకుడు ఎల్లయ్య, బనగానప ల్లె మండల ప్రాజెక్టు నాయకురాలు సరసవ్వతి, రేణుక, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డలో..

ఆళ్లగడ్డ(శిరివెళ్ల) : సమ్మెకాలంలో అంగనవాడీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జిల్లా నాయకురాలు నిర్మలమ్మ, ఆళ్లగడ్డ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, సీఐటీ యూ కార్యదర్శి రమేష్‌ బాబు సోమవారం డిమాండ్‌ చేశారు. హామీలు నెరవేర్చాలని అంగనవాడీ కార్మికులు ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పాతబస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగనవాడీ కార్మికుల ప్రతినిధులు శైలజ, పెద్దక్క, సుధామణి, భారతి, నరసమ్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:49 PM