సూపర్ సిక్స్ పథకాల అమలుతో బెంబేలెత్తుతున్న వైసీపీ
ABN , Publish Date - Jun 16 , 2025 | 10:37 PM
సూపర్ సిక్స్ పథకాల అమలుతో వైసీపీ నేతలు ఏంచేయాలో దిక్కుతోచక బెంబేలెత్తుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా క్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదలచేశారు. తల్లికి వందనం పథకం దా రా తల్లుల ఖాతాల్లో నగదు జమకావటంతో విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు ఏలా సమర్ధించుకోవాలో అర్థంకాక ఖంగుతింటున్నారని విమర్శించారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : సూపర్ సిక్స్ పథకాల అమలుతో వైసీపీ నేతలు ఏంచేయాలో దిక్కుతోచక బెంబేలెత్తుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా క్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదలచేశారు. తల్లికి వందనం పథకం దా రా తల్లుల ఖాతాల్లో నగదు జమకావటంతో విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు ఏలా సమర్ధించుకోవాలో అర్థంకాక ఖంగుతింటున్నారని విమర్శించారు. ఎక్కడైనా పథకం సరిగా అమలుకాలేదని వైసీపీ నాయకులు విమర్శిస్తే తల్లుల నుండే ప్రతిఘటన ఎదురవుతుం డటంతో బిక్కమొఖం వేస్తున్నారని విమర్శించారు. సీ ఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, వి ద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సూపర్ సి క్స్ పథకాలు వరుసగా అమలవుతుండటంతో అన్నీవ ర్గాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయలేక పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం హమీలను పూర్తిగా అమలు చేస్తుందని డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయటమే ఇందుకు నిదర్శనమన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలవుతుం దన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తుందన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభించటం శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్‌కు రూ.300 కోట్లు కేటాయించటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిధులు సమకూర్చటంతో పొగాకు రైతులకు న్యాయం జరుగు తుందన్నారు. దర్శి నియోజకవర్గంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుం టామన్నారు.