రైతులను విస్మరించిన వైసీపీ ప్రభుత్వం
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:03 AM
వైసీపీ రాక్షస పాలనలో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లిందని దాన్ని సరిచేయటం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు.
రాక్షస పాలనలో వారికి వెలకట్టలేని నష్టం
పొగాకు రైతుల సమస్య పరిష్కారానికి కృషి
రూ.కోటి సబ్సిడీ యంత్ర పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ రాక్షస పాలనలో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లిందని దాన్ని సరిచేయటం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. శుక్రవారం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏలూరి మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమమే రాష్ట్ర పభుత్వ లక్ష్యమన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అవసమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రపరికరాలను ఇవ్వకుండా మంగళం పలికిందన్నారు. కనీసం పంటల ఆరుతడులకు సక్రమంగా నీరు కూడా అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆయకట్టు చివరి భూములకు సైతం నీరు అందించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కోటి రూపాయల వ్యయంతో రైతాంగానికి వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు అందించినట్లు తెలిపారు. ఇందులో రూ.69 లక్షల సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో క్రీడా ప్రాంగణం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.నాగులపాలెం సమీపంలో నూతన హైవే నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఏలూరి పరిశీలించారు.
ట్రై సైకిల్స్ పంపిణీ...
పర్చూరు మండలానికి చెందిన పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను ఏలూరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే వెలుగు సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో సబ్సిడీపై అందించిన కెమెరాలను ఎమ్మెల్యే ఏలూరి చేతులు మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
తల సేమియా బాధితులకు భరోసా
సాకేత్ ట్రస్టు ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు ఎమ్మెల్యే ఏలూరి చేతుల మీదుగా రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్టు చైర్మన్ శ్రీనివాసరావుకు అందజేశారు.