వైసీపీ, కూటమి ప్రభుత్వాలు దొందూదొందే !
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:44 AM
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న కూటమి ప్రభుత్వం దొందూదొందేనని లిబరే షన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్‌ఆర్‌కేఆర్.విజయకుమార్ ధ్వజమె త్తారు.
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధినేత విజయ్‌కుమార్
కొత్తపట్నం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న కూటమి ప్రభుత్వం దొందూదొందేనని లిబరే షన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్‌ఆర్‌కేఆర్.విజయకుమార్ ధ్వజమె త్తారు. మంగళవారం రాత్రి కొత్తపట్నంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడు తూ పేదలను బిచ్చమెత్తుకునేలా ఈ రెండు ప్రభుత్వాలు పాలన కొనసాగించా యన్నారు. పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు వచ్చే పథకాలను అమలు చేయకుండా ఉచితాల పేరుతో దగా చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా మన ఓట్లను మనమే వేసుకుందామని, అధికారం చేజిక్కిచ్చుకున్నప్పుడే ఆత్మగౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. చిటితోటి శోభన్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో దమ్ము వెంకటేష్, ఐశ్వర్య, నాయక్ తదితరులు పాల్గొన్నారు.