Share News

రామకూరులో విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:14 PM

విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన రామకూరులో మంగళవారం చోటుచేసుకుంది.

రామకూరులో విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

పంగులూరు,నవంబరు 4(ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన రామకూరులో మంగళవారం చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన మహమ్మద్‌వలి నీటి పైపును డాబాపై నుంచి కిందకు వేసే ప్రయత్నంలో పైపు ఇంటి సమీపంలోని విద్యుత్‌లైన్‌ తీగలపై పడింది. ఆ పైపును పైకి లాగే ప్రయత్నంలో పైపుతో పాటు విద్యుత్‌లైన్‌కు ఉన్న తీగ చేతికి తగలడంతో మహమమద్‌వలి విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే వలి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య జపీనా, జాప్రూన్‌(9), రాధియా, రిఫాత్‌(7) ముగ్గురు బాలికలు ఉన్నారు. ఎస్‌ఐ వినోద్‌బాబు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

క్రేన్‌ ఢీకొని భార్య మృతి

భర్త, మరో మహిళకు గాయాలు

అద్దంకి, నవంబరు4(ఆంధ్రజ్యోతి) : మోటార్‌సైకిల్‌ను వెనుక నుంచి క్రేన్‌ ఢీకొనటంతో కంకణాల రేబికాకుమారి(30) మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని చెర్వుకొమ్ముపాలేనికి చెందిన కంకణాల వీరాంజనేయులు, భార్య రేబికాకుమారి, పిన్ని అరుణలు మంగళవారం ఉదయం మోటార్‌సైకిల్‌పై అద్దంకి-రేణింగవరం రోడ్డులో పొలం వెళ్తుండగా వెనుక నుంచి క్రేన్‌ ఢీకొట్టడంతో పడిపోయారు. రేబికాకుమారిని క్రేన్‌ బంపర్‌ ఈడ్చుకుంటూ పోయింది. క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా రేబికాకుమారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాయపడ్డ వీరాంజనేయులు, అరుణలను మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పీఎస్సై వెంకటేశ్వరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:14 PM