Share News

ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి

ABN , Publish Date - Jul 30 , 2025 | 10:47 PM

ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ అదుపుతప్పి కిందపడిన సంఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

ద్విచక్ర వాహనం అదుపు  తప్పి యువకుడు మృతి

కంభం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ అదుపుతప్పి కిందపడిన సంఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కంభం ఎస్సై నరసింహారావు కథనం ప్రకారం... మండలంలోని పెద్దనల్లకాల్వ గ్రామానికి చెందిన నాగెళ్ల పవన్‌(25) కంభం నుంచి స్వగ్రామమైన పెద్దనల్లకాల్వకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా చిన్నకంభం సమీపంలోని మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న కిలోమీటరు రాయికి బలంగా ఢీకొనడంతో పవన్‌ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Jul 30 , 2025 | 10:47 PM