Share News

గ్రానైట్‌ టిప్పర్‌ ఢీకొని యువకుడు దుర్మరణం

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:08 PM

గ్రానైట్‌ టిప్పర్‌ డీకొన్న సంఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు

 గ్రానైట్‌ టిప్పర్‌ ఢీకొని యువకుడు దుర్మరణం

చీమకుర్తి, జూన్‌6(ఆంధ్రజ్యోతి): గ్రానైట్‌ టిప్పర్‌ డీకొన్న సంఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చీమకుర్తి బైపాస్‌పై కేవీ.పాలెం జంక్షన్‌ సమీపంలో జరిగింది. చీమకుర్తికి చెందిన శివప్రసాద్‌(24) బైక్‌పై పట్టణంలోకి వస్తుండగా ఒంగోలు వైపు వెళ్తున్న గ్రానైట్‌ టిప్పర్‌ ఢీకొనటంతో తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే చనిపోయాడు. సీఐ సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jun 06 , 2025 | 11:08 PM