ఒంగోలులో యువకుడు ఆత్మహత్య
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:07 PM
బేకరీ షాపులో పనిచేసే యు వకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒంగోలు నగరం మంగమూరురోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఏంజెల్ బేకరీలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
ఒంగోలు క్రైం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): బేకరీ షాపులో పనిచేసే యు వకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒంగోలు నగరం మంగమూరురోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఏంజెల్ బేకరీలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలలోకి వెళితే.. స్థానిక కర్నూల్‌రోడ్డులోని రెవెన్యూకాలనీలో నివాసం ఉండే చల్లగాలి బాబు (19) బేకరీకి సమీపంలోని బంధువుల ఇంట్లో గొడవపడ్డాడు. మద్యం సేవించిన బాబును నిలవరిచేందుకు వరుసకు అక్క అయిన నయోమి, ఆమె కుమారుడు ఏబు వల్ల కాలేదు. దీంతో వారి ఇరువురిని ఇంట్లో ఉంచి బయిట గడియ పెట్టి సెల్‌ఫోన్‌ను విసిరివేసి మంగళవారం తెల్లవారు జామున వెళ్లిపోయాడు. అతనితో బేకరీలో పనిచేసే నారాయణ ఉదయం 6 గంటలకు అక్కడకు వెళ్లే సరికి బాబు లుంగీతో ఇనుపరాడ్డుకు ఉరి వేసుకొని మృతి చెంది ఉన్నాడని మృతిడి సోదరుడు నవీన్ తెలిపారు. ఈమేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
మృతుడు ఒంగోలు వాసి
తుర్కపల్లి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): భువనగిరి-గజ్వేల్ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పెద్ద తండ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి సోమవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడు ఒంగోలుకు చెందిన వ్యక్తి అని అతని వెంట వచ్చిన వ్య క్తులు చెప్పారు. ఎస్‌ఐ తక్యుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు కు చెందిన శేషయ్య తుర్కపల్లి మండలం రామోజీనాయక్ తండాలో మేస్ర్తీగా పనిచేస్తున్నాడు. శేషయ్య సెప్టెంబరు 23న ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు అతని వెంట ఇద్దరు కూలీలు శ్రీను(30), రవిని తీసుకొచ్చాడు. వారు భువనగిరికి చేరుకోగానే రామోజీనాయక్ తండాకు చెందిన డ్రైవర్ సీతాపతి మారుతి ఈకో వ్యాన్ తీసుకుని భువనగిరికి వెళ్లాడు. వారిని వ్యాన్‌లో ఎక్కించుకుని వస్తుండగా పెద్దతండా సమీపంలో ఎదురుగా వస్తున్న కారు వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న నలుగురు వ్యక్తుల్లో మేస్త్రి శేషయ్య, శ్రీను, రవిలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో శ్రీను చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. శ్రీను ఒంగోలు కూలీల అడ్డాపై ఉండగా తమ వెంట తీసుకొచ్చామని, అతని పేరు శ్రీను అని మాత్రమే తమకు తెలుసునని మేస్త్రి శేషయ్య చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి మెడపై అమ్మ, కుడిచేతి మీద లవ్ సింబల్, స్టార్ టాట్యు మచ్చలు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వివరాలు తెలిస్తే ఫోన్ నెంబర్లు 8712662479, 8712662805కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
ఒంగోలు క్రైం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన మంగళవారం పెళ్లూరు సమీపంలోని ఆలాస్ హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. మృతుడి తల, ముఖంపై బలమైన గాయాల వల్ల రక్తస్రావమై మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా, ఎవరైనా హత్య చేసి అక్కడ పడవేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సమాచారం అందుకున్న తాలుకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలిచారు. మృడిని ఆచూకీ కోసం విచారణ చేపట్టారు.