డాబా మెట్లు దిగుతూ జారిపడి యువకుడు మృతి
ABN , Publish Date - Apr 16 , 2025 | 10:46 PM
తాళ్లూరు మండలంలోని కొత్తపాలెంలో ఓ యువకుడు రాత్రి సమయంలో డాబా దిగుతూ జారిపడి మృతి చెందిన ఘటనపై బుధవారం కేసు నమోదైంది.
తాళ్లూరు, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొత్తపాలెంలో ఓ యువకుడు రాత్రి సమయంలో డాబా దిగుతూ జారిపడి మృతి చెందిన ఘటనపై బుధవారం కేసు నమోదైంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... కొత్తపాలేనికి చెందిన చెరుకుపల్లి నరసింహారావు(35) రాత్రి ఇంటిడాబాపై నిద్రిస్తుండగా 12గంటల సమయంలో మంచినీటి కోసం కిందకు దిగుతూ నిద్రమత్తులో డాబా అంచున కాలు వేసి జారిపడ్డారు. పిట్ట గోడలేకపోవటం వల్ల జారి నేలపైపడటంతో కాళ్లువిరిగి పోగా, తలభాగం తీవ్రంగా దెబ్బతింది. తీవ్ర గాయాలైన నరసింహారావును ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఉదయం మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు ఏఎ్‌సఐ మోహన్‌రావు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.