సముద్రంలో పడి యువకుడు మృతి
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:00 PM
సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయిన యువకుడు మృత్యువాతపడ్డాడు.
కొత్తపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయిన యువకుడు మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళితే... టంగుటూరు మండలం మర్లపాడుకు చెందిన జలదంకి నాగచందు(19) ఆదివారం మండలంలోని మడనూరు సముద్ర తీరంలో స్నానం చేస్తూ అలలకు కొట్టుకుపోయాడు. చందు మృతదేహం సోమవారం మండలంలోని వజ్జిరెడ్డిపాలెం సముద్రం తీరానికి కొట్టుకువచ్చింది. స్థానికులు అందించిన సమాచారంతో కొత్తపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.