Share News

చెరువులో పడి యువకుడు మృతి

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:09 AM

సంతనూతలపాడు పెద్ద చెరువులో పడి యువ కుడు మృతి చెందిన సంఘటన మంగళవారం ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది.

చెరువులో పడి యువకుడు మృతి

సంతనూతలపాడు, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): సంతనూతలపాడు పెద్ద చెరువులో పడి యువ కుడు మృతి చెందిన సంఘటన మంగళవారం ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్‌ఐ వెంక ట్రావు తెలిపిన వివరాల మేరకు.. చీమకుర్తికి చెందిన నేరెళ్ల వెంకటేష్‌ (25) సోమవారం మధ్యాహ్నం చీమకుర్తి నుంచి ఒంగోలుకు ఆటో లో బయలుదేరాడు. రాత్రి 10 దాటిన అతను ఇంటికి చేరుకోకపోవడంతో చుట్టుపక్కల వారిని, వేరే ఊళ్లలో బంధువులను కుటుంబసభ్యులు వి చారించారు. ఈక్రమంలో మంగళవారం సా యంత్రం స్థానికులు కొందరు పెద్దచెరువు వైపు గా వెళ్తుండగా మృతదేహం నీటిలో తేలియాడు తున్న విషయం గుర్తించి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కు టుంబసభ్యులు చేరుకుని వెంకటేష్‌ మృతదేహం గా గుర్తించి కన్నీరుమున్నీరు అయ్యారు. పో లీసులు చెరువులో నుంచి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తర లించారు. మార్గం మధ్యలో సంతనూతలపాడు చెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు దిగిఉంటాడని, ప్రమాదవశాత్తు నీటిలో పడి వెంకటేష్‌ మృతి చెంది ఉంటాడని భావిస్తున్నా రు. మృతుడు తండ్రి పున్నారావు ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 11 , 2025 | 12:09 AM