Share News

యోగాంధ్ర ర్యాలీలు

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:27 AM

జిల్లా వ్యాప్తంగా సోమవారం యోగాంధ్ర అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పలుప్రాంతాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.

యోగాంధ్ర ర్యాలీలు
ఒంగోలులో ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌ అన్సారియా, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్‌ తదితరులు

జిల్లావ్యాప్తంగా నిర్వహణ

పలుచోట్ల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు

ఒంగోలు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా సోమవారం యోగాంధ్ర అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పలుప్రాంతాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఆ రోజున విశాఖలో ఐదు లక్షల మందితో యోగాడే నిర్వహి స్తుండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన నున్నారు. అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కేంద్రాల్లో రెండు కోట్ల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులోభాగంగా జిల్లాలో పది లక్షల మంది పాల్గొ నేలా లక్ష్యం నిర్దేశించింది. అందుకు ప్రజలను సమా యత్తం చేసేందుకు, వారిలో అవగాహన కల్పిం చేందుకు బహుముఖ కార్యక్రమాలను నెలరోజు లుగా నిర్వహిస్తున్నారు. సోమవారం జిల్లావ్యాప్తం గా పెద్దఎత్తున యోగాంధ్ర అవగాహన ర్యాలీలు చేపట్టారు. ఒంగోలులో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ర్యాలీని ప్రారంభించగా, ఒంగోలు, సంతనూతల పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజ య్‌కుమార్‌, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూక సాని బాలాజీ, మేయర్‌ గంగాడ సుజాత, జేసీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కనిగిరిలో నిర్వహించిన ర్యాలీలో అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి భాగస్వాములయ్యారు. రాచర్లలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి బస్టాండు వరకు నిర్వహించిన ర్యాలీలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎర్రగొండపాలెంలో జరిగిన ర్యాలీలో అక్కడి ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, మార్కాపురం ర్యాలీలో సబ్‌కలెక్టర్‌ వెంకటత్రినాగ్‌ పాల్గొన్నారు. పలు మండలకేంద్రాల్లో నూ ర్యాలీలు, మానవహారాలు, ఇతర పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈనెల 21న జరిగే యోగా దినోత్సవానికి సన్నాహకంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రోజు భారీ యోగా కార్యక్రమాలకు ప్రభుత్వం ఆదేశించింది. అందులోభాగంగా ఈనెల 20న ఒంగోలులో పది వేల మంది మహిళలతో యోగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 01:27 AM