నేడు త్రిపురాంతకంలో యోగాంధ్ర
ABN , Publish Date - Jun 02 , 2025 | 10:52 PM
త్రిపురాంతకంలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తెలిపారు. దాదాపు 2 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ త్రివినాగ్
త్రిపురాంతకం, జూన్ 2, (ఆంధ్రజ్యోతి) : త్రిపురాంతకంలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తెలిపారు. దాదాపు 2 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. బాలాత్రిపురసుందరీదేవి ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు, ఉదయం 6గంటలకే కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు, ప్రజలు సకాలంలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమం పేరుతో రూపొందించిన టీషర్టులను ఆయన అధికారులకు అందజేశారు.