Share News

ఏళ్లు గడుస్తున్నా.. మొండి గోడలే

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:53 AM

ఏళ్లు గడుస్తున్నా.. నియోజవర్గ కేంద్రం వై.పాలెంలో ఉపాధి హామీ కార్యాలయం ఇరుకు గదుల్లోనే నిర్వహిం చాల్సి వస్తోంది.

ఏళ్లు గడుస్తున్నా.. మొండి గోడలే

ఎర్రగొండపాలెం రూరల్‌ మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఏళ్లు గడుస్తున్నా.. నియోజవర్గ కేంద్రం వై.పాలెంలో ఉపాధి హామీ కార్యాలయం ఇరుకు గదుల్లోనే నిర్వహిం చాల్సి వస్తోంది. స్త్రీశక్తి భవనం పైఅంతస్థులో ఈ ఉపాధిహామీ కార్యాలయాన్ని నిర్వహించాలని ప్రతిపాదించి నిధులు మంజూరు చేస్తామని మాజీ మంత్రి సురేష్‌ అప్పట్లో హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. నేడు కూటమి ప్రభుత్వమైన దీనిపై దృష్టిసారించి నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది.

2014 -15 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మహిళకు ఉపయోగకరమైన వెలుగు కార్యాలయం కోసం ఉపాధి హామీ పథకం నిధులు రూ.25 లక్షలు వెచ్చించి స్త్రీశక్తి భవనానికి శ్రీకారం చుట్టింది. రెండు అంతస్థుల్లో నిర్మించాల్సిన ఈ కార్యాలయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్త్రీశక్తి భవనం, రెండవ ఫ్లోర్‌లో ఉపాధి హామీ కార్యాలయం నిర్మించాల్సి ఉంది. అయితే నేటికీ భవనం అసంపూర్తిగానే ఉంది. మొదటి ఫ్లోర్‌లో వెలుగు కార్యాలయం నిర్వహిస్తున్నప్పటికీ, రెండవ ఫ్లోర్‌లో ఉపాధిహామీ పథకం కార్యాలయం మాత్రం మొండి గోడలతోనే దర్శనమిస్తోంది. అప్పటి నాయకుల, అధికారుల సమన్వయం లోపంతో స్లాబ్‌ వేసి అసంపూర్తిగా వదిలేశారు.

నిందులు మంజూరు చేస్తామని ప్రకటించి...

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణ పనులు నత్తనడకనే సాగాయి. ఎట్టకేలకు 2024 జనవరిలో అప్పటి మంత్రి ఆదిమూ లపు సురేష్‌ ఈ భవనాన్ని ప్రారంభించారు. మొదటి ఫ్లోర్‌లో ఉన్న స్త్రీశక్తి భవనం ప్రారంభించి, రెండవ ఫ్లోర్‌లో ఉన్న ఉపాధిహామీ కార్యాలయం నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అప్పట్లో ఆయన హామీ అమలుకు నోచుకోలేదు. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైన దృష్టిసారించి ఈ భవనం పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.

వివిధశాఖలకు నిధులు ఇస్తున్నా..

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఉపాధిహామీ పథకానికి కీలకమైన భూమిక ఉంది. రోడ్లు కానీ, వివిధ పంచాయతీరాజ్‌ భవనాలు, గోకులంషెడ్లు పలు వాటర్‌ ప్రాజెక్టులకు ఉపాధి పథకం ద్వారా మ్యాచింగ్‌గ్రాంట్లు మంజూరవుతుంటాయి. ఆయా శాఖలకు ఈ పథకం నిధులే వెచ్చిస్తారు. అయితే ఆ పథకం కార్యాలయానికే సొంత భవనం లేకపోవడం విశేషం. ప్రస్తుతం మండల పరిషత్‌ కార్యాలయ భవనంలో చిన్న గదిలో సరైన వసతులు లేక ఇరుకు గదుల్లో పనులు చేసుకుంటున్నారు సిబ్బం ది. ఉపాధి హామీపథకం అంటే పదులు సంఖ్యలో సిబ్బంది ఉంటా రు. అలాగే పదులు సంఖ్యలో కూలీలు కార్యాలయానికి వస్తుం టారు. అలాంటి కార్యాయానికి సొంత భవనం లేకపోవడంతో ఇటు కూలీలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి ఉపాధి హామీ పథకం భవనం పూర్తి చేసి అన్ని వసతులు కల్పించాలని ఆ శాఖ సిబ్బంది, ఉపాధి కూలీలు కోరుతున్నారు.

Updated Date - Mar 12 , 2025 | 12:54 AM