వైసీపీ బురద రాజకీయాలకు స్వస్తి పలకాలి
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:59 PM
మొంథా తుఫాన్ రాష్ట్రం జల విలయం చేస్తే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన సమర్ధవంతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్డర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
మంత్రి స్వామి
మర్రిపూడి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ రాష్ట్రం జల విలయం చేస్తే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన సమర్ధవంతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్డర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నిరంతరం జిల్లాస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి గ్రామ సహాయకుల వరకు దిశానిర్దేశం చేస్తూ ప్రకృతి విలయం నుంచి ప్రజలను కాపాడగలిగారని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబులు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. గత ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినప్పటికీ వారి తీరు మారలేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో జలవిలయం తాండవిచ్చిందని ఎన్నో ఏళ్లుగా నిండని జలాశయిలు, చెరువులు సమృద్ధిగా జలకళ సంతరించుకున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా రాత్రింబవళ్లు అధికార యంత్రాంగం చేసిన కృషిని ఆయన అభినందించారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని తెలిపారు. ఆర్‌అండ్‌బీ పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించి త్వరితగతిన మరమ్మతులు చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందించాలని ఆదేశించామన్నారు. మర్రిపూడి చెరువు కట్ట కింద ప్రమాదకరంగా మారిన కోనేరుల వద్ద తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ డీఈని ఫోన్‌లో ఆదేశించారు. రూ.39 కోట్ల గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయిస్తే వైసీపీ పాలకులు పనులు పూర్తి చేయించలేకపోయారని విమర్శించారు. లక్ష్మీనరసింహస్వామి ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.4కోట్ల నిధులు మంజూరు చేయించానని రహదారి నిర్మాణానికి భక్తులు సహకరించాలని కోరారు. త్వరలో టంగుటూరు పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారి శాశ్వత అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మర్రిపూడిలో పీడీసీసీబీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మర్రిపూడి సచివాలయాన్ని రెండుగా విభజించి వల్లాయపాలెం పంచాయతీని మర్రిపూడి సచివాలయ పరిధిలో చేర్చాలని గ్రామస్థులు కోరారు. విలేకరుల సమావేశంలో మర్రిపూడి సొసైటీ అధ్యక్షుడు ఎర్రమోతు శ్రీనివాసులు, నాయకులు రేగల వీరనారాయణ, దాసరి వెంకటేశ్వర్లు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చేరెడ్డి నర్సారెడ్డి, తుళ్లూరి నరసింహారావు, మాకినేని శ్రీనివాసరావు, సారెడ్డి నరసింహారెడ్డి, ఎర్రంరెడ్డి వెంకట్‌రెడ్డి, చెన్నుబోయిన బాలనర్సయ్య, ముత్తముల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.