అధికారం కోల్పోయినా వైసీపీకి బుద్ధి రాలేదు
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:43 PM
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ శవరాజకీయాలను చేస్తోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్ ఆ రోపించారు.
శవ రాజకీయాలను చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి
ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ రియాజ్ ధ్వజం
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 24 (ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ శవరాజకీయాలను చేస్తోందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్ ఆ రోపించారు. మంగళవారం ఒంగోలులోని ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలను రె చ్చగొడుతోందని ఆరోపించారు. వైసీపీ నాయ కులు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి మహిళలపై సాక్షి మీడి యాలో వచ్చిన అంశాలపై పొదిలిలో మహిళ లు నిరసన వ్యక్తం చేస్తుంటే వైసీపీ కార్యక ర్తలు దాడి చేశారన్నారు. పల్నాడు జిల్లా పర్య టనలో జగన్మోహన్‌రెడ్డికి పోలీస్‌శాఖ కొన్ని సూచనలు చేసినా అవేమి పట్టించుకోకుండా బలప్రదర్శన చేయడం విడ్డూరంగా ఉందని వి మర్శించారు. తెనాలిలో గంజాయి తాగే రౌడీషీ టర్లను పోలీసులు కొడితే వారిని పరామర్శించే ందుకు వైసీపీ అధినేత జగన్ వెళ్లారని, రా ష్ట్రంలో వైసీపీ ఉండేది రౌడీలకు కొమ్ముకాయ డానికా అని ఆయన ప్రశ్నించారు. పల్నాడు ప ర్యటనలో జగన్మోహన్‌రెడ్డి కారుటైరు కింద పడిన వైసీపీ కార్యకర్తను పట్టించుకోకుండా వె ళ్ళిపోయిన వ్యక్తి అని అన్నారు. పోలీసుల సూ చనలు కూడా పట్టించుకోకుండా రప్పా...ర ప్పా అని మాట్లాడటం సభ్యసమాజం సిగ్గుప డాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్ర జాప్రతినిధిపై ఉందని చెప్పారు. జగన్ చే స్తున్న కార్యక్రమాలను వైసీపీ కార్యకర్తలు వ్య తిరేకించాలని పిలుపునిచ్చారు. కారు టైరు కింద పడితే రూ.10లక్షలు పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం బలంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుం దని దీమా తెలిపారు. జనసేన పార్టీ సీనియ ర్ నాయకుడు కంది రవిశంకర్ మాట్లాడుతూ ఎన్నికల ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని కూట మి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఏడాది పాల నలో ఎలాంటి అక్రమాలు లేకుండా పరి పాలన జరుగుతోందని తెలిపారు. డిప్యూటీ సీ ఎం పవన్‌కళ్యాణ్ అందరినీ సమన్వయం చే సుకుని పాలన చేస్తున్నారని చెప్పారు. అలాం టి ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగద న్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకు లు పాల్గొన్నారు.