వెలిగొండ ప్రాజెక్టును గాలికి వదిలేసిన వైసీపీ
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:59 PM
వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు వైలిగొండ ప్రాజెక్ట్‌ను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని టీడీపీ పెద్దారవీడు మండల కన్వీనర్ మెట్టు శ్రీనివాసులరెడ్డి అన్నారు. మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు.
వైపాలెం ఎమ్మెల్యేకి ముంపు గ్రామాలకు వెళ్లే ధైర్యముందా?
ప్రశ్నించిన టీడీపీ నాయకులు
పెద్దారవీడు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు వైలిగొండ ప్రాజెక్ట్‌ను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని టీడీపీ పెద్దారవీడు మండల కన్వీనర్ మెట్టు శ్రీనివాసులరెడ్డి అన్నారు. మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. మెట్టు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వకుండా వైసీసీ పాలకులు మాటలతో మభ్యపెట్టారన్నారు. ఈ ఏడాది, వచ్చే ఏడాదంటూ కాలయాపనతో ప్రజలను మోసగించారన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ఎన్నికల హామీ మేరకు పూర్తి చేసి వచ్చే ఏడాది నీళ్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తతంటే వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు నిర్వాసిత గ్రామాలలో పర్యటించే ధైర్యముందా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు వైసీపీ నాయకుల మాదిరి కాసులకు కక్కుర్తి పడేందుకు సిద్ధంగా లేరని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి గొట్టం శ్రీనివాసులరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు చింతగుంట్ల రాజేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, రిటైర్డ్ వీఆర్వో చింతగుంట్ల సుబ్బరామిరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు జడ్డా రవి, టీఎన్‌టీయూసీ నాయకులు దొడ్డా తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.