విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:14 PM
విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ తెలిపారు. ఆదివారం ఒంగోలు వెలుతూ గిద్దలూరులో కొద్దిసేపు ఆగారు.
కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ
గిద్దలూరు టౌన్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ తెలిపారు. ఆదివారం ఒంగోలు వెలుతూ గిద్దలూరులో కొద్దిసేపు ఆగారు. విశ్వబ్రాహ్మణ సంఘం స్థానిక ప్రతినిధులు ఆమెను కలిశారు. ఈసందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు షరాఫ్ దత్తాచారి, గౌరవాధ్యక్షుడు దొడ్డోజు రంగాచారి, సంఘ సభ్యులు కమ్మరి క్రిష్ణమాచారి, షరాబ్ నరసింహాచారి, గూడలూరి శంకరాచారి, పొద్దుటూరి సాయికుమార్‌చారి, బి.గురుస్వామిలు కమ్మరి పార్వతమ్మను శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం పార్వతమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహక పథకాలు, మహిళలకు ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. యువత తమ సామాజిక బాధ్యతను గుర్తించి సేవా కార్యక్రమాలలో ముందుండాలని పిలుపునిచ్చారు.