Share News

విద్యార్థుల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:03 PM

:రాష్ట్రంలో వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యార్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం వసతి గృహాల్లో సమగ్రమైన మార్పులు చేపట్టిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. తాళ్లూరులో 8 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోని కేజీబీవీ టైప్‌ 2 బాలికల వసతి గృహాన్ని మంత్రితోపాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మితో కలిసి బుధవారం ప్రారంభించారు.

విద్యార్థుల సంక్షేమానికి కృషి
కస్తూర్బాగాంధీ విద్యాలయం టైప్‌ 2 గృహాన్ని ప్రారంభిస్తున్న మంత్రి స్వామి,ఎంపీ మాగుంట, టీడీపీ ఇన్‌చార్జి లక్ష్మి

తాళ్లూరు,డిసెంబరు24 (ఆంధ్రజ్యోతి) :రాష్ట్రంలో వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యార్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం వసతి గృహాల్లో సమగ్రమైన మార్పులు చేపట్టిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. తాళ్లూరులో 8 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోని కేజీబీవీ టైప్‌ 2 బాలికల వసతి గృహాన్ని మంత్రితోపాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లో సమగ్రమైన మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. తాళ్లూరులో బీసీ బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరారని, ఎస్సీ వసతి గృహంలో బీసీలకు అడ్మిషన్లు ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 8ఏళ్ల క్రితం నిర్మించి నేటికీ ఉపయోగంలోలేని కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని మంత్రి స్వామి ప్రత్యేక కృషితోనే ప్రారంభించామన్నారు. టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, భద్రమైన వసతి కల్పిస్తున్నదన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాపారావు, టీడీపీ నాయకులు డాక్టర్‌ కడియాల సాగర్‌, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి, వైస్‌ ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్‌ బాబు, రాష్ట్రనాటక అకాడమి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు గొంది రమణారెడ్డి, రాష్ట్రతెలుగుయువత కార్యదర్శి జి.వేణుబాబు,టీడీపీనాయకులు , అధికారులు పాల్గొన్నారు.

పల్లె ప్రగతి ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం

పామూరు : పల్లె ప్రగతి తోపాటు గ్రామ వికాసం కూటమి ప్రభుత్వతోనే సాధ్యం అవుతుందని మంత్రి డోలా బాలాంజనేయస్వామి అన్నారు. మండలంలోని వగ్గంపల్లి గ్రామంలో ఐవోసీ పెట్రోల్‌ బంకును ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డితో కలిసి మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఫిల్లింగ్‌ స్టేషన్‌ నిర్వాహకులు సక్రమంగా నిర్వహించి వినియోగదారులకు సక్రమంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ కామేపల్లి సీతారామయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ ఉప్పలపాటి హరిబాబు, డైరెక్టర్‌ వై .రహీముల్లా, హాస్పిటల్‌ డైరెక్టర్‌ ఎన్‌. సాంబయ్య, వగ్గంపల్లి, ఇనిమెర్ల టీడీపీ అధ్యక్షులు బైరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నల్లబోతుల వెంకటేశ్వర్లు, పువ్వాడి వెంకట్‌, పీఏసీఎస్‌ పామూరు సీఈవో శేషిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:03 PM