వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:06 AM
వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు.
సంతమాగులూరు సెప్టెంబర్ 24(ఆంధ్రజ్యోతి ): వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్య క్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి గొట్టిపాటి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడు తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతగానో కృషి చేస్తున్నా రన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిం దేందుకు పంటమార్పిడి పైకి అవగాహన కల్పించేందు కు ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రవికుమార్ తెలిపారు. వ్యవసాయ అధికారులు సిబ్బంది ప్రతి రైతును కలిసి వ్యవసాయం లాభ సాటిగా మార్చుకునేందుకు ఐదు అంశాలతో కూడిన ప్రాధాన్యతలను తెలియజేస్తు న్నారన్నారు.
అన్నదాత సుఖీభవ కింద అద్దంకి నియోజకవర్గంలో 40228 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని, సంతమాగులూరు మండలంలో 8871 మంది రైతులు లబ్ధి పొందారన్నారు. కొమ్మలపాడు అగ్రహారం భూములలో 1373 మంది రైతులు ఉండగా 966 మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదు జమైనట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ జమ కాని రైతుల సాంకేతిక సమస్యలు ఉన్న 377 మంది రైతులకు కూడా నగదు జమయ్యేలా చూస్తామన్నారు.
గత పాలకుడు జగన్ జమానాలో ఐదేళ్లలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించిన రైతులకు 1870 కోట్లు జగన్ జమానాలో చెల్లించకుండా బాకీలు ఉన్నట్లు తెలిపారు. రైతుశ్రేయస్సు ముఖ్యంగా పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత బకా యిలు రూ.1870 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. పొగాకు రైతులను సంక్షోభం నుండి కాపాడేందుకు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రూ.270 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించి పొగాకు కొనుగోలు చేసిందన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని మంత్రి రవికుమార్ గుర్తు చేశారు. రైతులకు ఎరువుల సమస్యను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. రైతులు అధికారులకు సహకరించి పంటమార్పిడి విధానాన్ని అనుసరించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్టూరు ఏడీఏ వ్యవసాయ అధికారి షేక్ సైదా, ఉద్యానవనశాఖ అధికారి హనుమంతనాయక్, తహసీల్దార్ రవిబాబు, సంతమాగులూరు ఏఎంసీ చైర్మన్ తేలప్రోలు రమేష్, టీడీపీ మండల అధ్యక్షుడు చేవూరి వాసురెడ్డి, గ్రామ టీడీపీ కార్యదర్శి కొష్టాల మస్తాన్‌వలి, నాయకులు మోతాదు భాషా, అబ్దుల్ హఫీజ్,, బుజ్జి గారి ఖాదర్ మస్తాన్ పాల్గొన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం
అద్దంకిటౌన్ : ప్రభుత్వం రైతుల కొరకు విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సోమవారం మండలంలోని నాగులపాగు గ్రామంలో పర్యటించిన ఆయన ‘రైతన్న.. మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు, సిబ్బందితో కలిసి రైతుల ఇంటి వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి సందేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సంబంధిత యాప్‌లో రైతుల వివరాల నమోదును మంత్రి పరిశీలించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.14 వేలను రైతుల ఖాతాలల్లో జమ చేసినట్లు తెలిపారు. జనవరిలో మరో 6 వేల రూపాయలు అందిస్తామని అధికారులు తెలిపారు. ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ వ్యవసాయ సిబ్బంది ప్రతి రైతు ఇంటికి వెళ్లి సాగుకు మంచి చేసే ముఖ్యమంత్రి 5 సూత్రాలను రైతులకు తెలియజేయాలన్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ పద్దతిలో వ్యవసాయం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులై ఉండి అన్నదాత సుఖీభవ రాని రైతులను సర్వే ద్వారా సేకరించి వారికి పథకం వర్తింప జేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఏవో కె. అన్నపూర్ణ, ఏడీఏ బి. ఎఫ్రాయిమ్, ఏవో కొర్రపాటి వెంకటకృష్ణ, ఉద్యానశాఖ అధికారిణి ఎస్. దీప్తి, బాపట్ల శాస్త్రవేత ఏడుకొండలు, గ్రామ వ్యవసాయ సహాయకులు చాందిని, వీఆర్‌వో అనంతలక్ష్మి, వెటనరీ అసిస్టెంట్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.