Share News

ఏడు చోట్ల నిలిచిన అంగన్‌వాడీ భవనాల పనులు

ABN , Publish Date - May 22 , 2025 | 11:07 PM

గత వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోగా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా అడ్డుకుంది. పెద్దారవీడు మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులు నిలిచిపోవడం వైసీపీ పాలనలో చిత్తశుద్ధికి అద్దం పడుతుంది.

ఏడు చోట్ల నిలిచిన అంగన్‌వాడీ భవనాల పనులు

టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు ప్రారంభం

వైసీపీ పాలనలో చెల్లించని బిల్లులు

పెద్దారవీడు, మే 22 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోగా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా అడ్డుకుంది. పెద్దారవీడు మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులు నిలిచిపోవడం వైసీపీ పాలనలో చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. నిలిచిన ఏడు అంగన్‌వాడీ భవనాలు పెద్దారవీడు మండలంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో ఏడు అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి అనుమతిచ్చింది. అందుకుగాను ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.7.50 లక్షల నిధులు కేటాయించింది. నిర్మాణ పనులు వేగవంతంగా జరిగాయి. భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న సమయంలో 2019లో జరిగిన ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకూ జరిగిన పనులకు గాను టీడీపీ ప్రభుత్వం రూ.4.60 లక్షల చొప్పున బిల్లులు మంజూరు చేసింది. వైసీపీ వచ్చాక బిల్లులు మంజూరు చేయడంలో జాప్యం కారణంగా కాంట్రాక్టర్‌లు ఆ పనులను నిలిపి వేశారు. దీంతో అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు ఆగిపోయాయి. పశువుల కొస్టాలుగా మండలంలోని పెద్దారవీడు, వైడిపాడు, బద్వీడు, కర్రోల, సీహెచ్‌ అగ్రహారం, బద్వీటి చెర్లోపల్లి, కం భంపాడులలో నిర్మాణ పనులు నిలిచిపోయి ఇప్పటికి ఏడేళ్లు గడిచింది. నిరుపయోగంగా ఉన్న అంగన్‌వాడీ భవనాలలో సమీపంలోని రైతులు తమ పశువులను ఉంచుకుంటున్నారు. దీంతో ఆయా భవనాలు పశువుల కొట్టాలుగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వానికి నివేదికలు పంపాం మండలంలో నిలిచిన అంగన్‌వాడీ భవనాల పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నాం. అధికారులు నిర్ణయించిన వెంటనే నిర్మాణ పనులకు చర్యలు తీసుకుంటాం. - ఎం.లక్ష్మీదేవి, సూపర్‌వైజర్‌ 4 నల్లవాగును పరిశీలిస్తున్న నాయకులు కాలువను పరిశీలించిన టీడీపీ నాయకులు మార్కాపురం రూరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని శివరాంపురం గ్రామం సమీపంలో మరమ్మతులకు గురైన మార్కాపురం చె రువుకు నీరు చేరే వాగు కాలువను గురువారం మార్కాపురం చెరువు నీటి సంఘం అధ్యక్షుడు దగ్గుల శ్రీనివాసరెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, బోడపాడు టీడీపీ నాయకులు బొగ్గు శేఖర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సంఘం చైర్మన్‌ దగ్గుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శివవరాంపురం గ్రామ సమీపంలో ఉన్న నల్లవాగు కాలువ మరమ్మతులకు గురి కావడంతో వరద నీరు వృథాగా పోతున్నదని, వాటిని పరిశీలించి కాలువ మరమ్మతు పనులు చేసి మార్కాపురం చెరువుకు నీరు చేరేలా చేయాలని అధికారులకు తెలియజేస్తామని తెలిపారు.

Updated Date - May 22 , 2025 | 11:07 PM