సమన్వయంతో పనిచేయండి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:14 AM
శింగరకొండ 70వ వార్షిక తిరునాళ్ల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు అన్నారు. శిం గరకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై మంగళవారం శింగరకొండలో అన్ని శాఖల అధికారులతో ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగిం ది.

ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు
అద్దంకి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : శింగరకొండ 70వ వార్షిక తిరునాళ్ల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు అన్నారు. శిం గరకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై మంగళవారం శింగరకొండలో అన్ని శాఖల అధికారులతో ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగిం ది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడు తూ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించటం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌఖర్యం జరగకుండా స్వామి వార్ల దర్శనం జరిగే లా చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి చి న్న సంఘటన జరిగినా వెంటనే స్పందిం చి మిగిలిన శాఖల అధికారులకు సమాచారం అందించాలన్నారు. డీఎస్పీ మొయిన్ మాట్లాడుతూ విద్యుత్ ప్రభలపై అశ్లీల, అర్ధనగ్న ప్రదర్శనలను అనుమతించేది లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కు వగా విద్యుత్ వెలుతురు ఉండే విధంగా చూడాలన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుం డా వాహన చోదకులు పార్కింగ్ స్థలాలలో మాత్రమే వాహనాలను నిలపాలన్నారు. సమావేశంలో ఆలయ ఈవో తిమ్మానాయుడు, విద్యుత్ ఈఈ నల్లూరి మస్తాన్‌రావు, తహసీల్దార్ శ్రీచరణ్, ఎంపీడీవో శింగయ్య, సీఐ సుబ్బరాజు, ఈవోఆర్డీ ప్రసాదరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.