Share News

పాతమార్కెట్‌ వద్ద పనుల ప్రారంభం

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:42 AM

ఒంగోలు నగరం లోని ట్రంక్‌రోడ్‌ విస్తరణకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఈ మే రకు రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయేవారికి ప్రత్యామ్నాయం గా షాపులు కట్టించేందుకు అవసరమైన ఏర్పాట్లను కార్పొరేషన్‌ అ ధికారులు ప్రారంభించారు.

పాతమార్కెట్‌ వద్ద పనుల ప్రారంభం

ట్రంక్‌ రోడ్‌ వ్యాపారుల షాపుల సంఖ్యపై సందిగ్ధం

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరం లోని ట్రంక్‌రోడ్‌ విస్తరణకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఈ మే రకు రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయేవారికి ప్రత్యామ్నాయం గా షాపులు కట్టించేందుకు అవసరమైన ఏర్పాట్లను కార్పొరేషన్‌ అ ధికారులు ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం పాతకూరగా యల మార్కెట్‌ వద్ద స్థలంలోని చెత్తను తొలగించి శుభ్రం చేసే ప నులు చేపట్టారు. అయితే ఎన్ని షాపులు నిర్మిస్తారు. ఏ విధమైన డి జైన్‌తో నిర్మిస్తారనే విషయం స్పష్టత లేదు. 100 అడుగులు విస్తరిస్తే 123 మందికి షాపులు నిర్మించాల్సి ఉండగా, 90 అడుగులు విస్తరిస్తే సుమారుగా 105 షాపులు, 80 అడుగులు అయితే 72 షాపులు కో ల్పోయే అవకాశం ఉండటంతో ఎన్ని అడుగులు విస్తరించాలనే విష యంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే తుది నిర్ణయం వచ్చే వ రకు ప్రాథమికంగా వారికి పాత మార్కెట్‌లో షాపుల నిర్మాణం, అ లాగే 1ః4 నిష్పత్తిలో టీడీఆర్‌ బాండ్‌లు ఇవ్వనున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:42 AM