మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:48 AM
కుటుంబాలలో మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబంలోని సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.
మార్టూరు,సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): కుటుంబాలలో మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబంలోని సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మార్టూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటరులో ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు.ఈ సందర్బంగా ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఎమ్మ్మెల్యే ఏలూరి మాట్లాడారు. వచ్చేనెల 2న వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలలో మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ట్ భరించేలా ప్రణాళిక అమలుచేస్తోందన్నారు. తరువాత ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సక్రమంగా వైద్యసేవలను అందించాలని వైద్యాధికారులను కోరారు. తరువాత ఆయుష్ విభాగంలో వైద్యాధికారి అంజమ్మతో మాట్లాడారు. వైద్యశాలలో అన్ని రకాలు మందులు ఉన్నాయా అంటూ అంజమ్మను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులతో పాటు,పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
స్మార్ట్ రైస్‌కార్డుల పంపిణీ
మండలంలోని వలపర్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మహిళలకు స్మార్ట్‌రైస్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషను షాపుల ద్వారా ప్రతి కుటుంబానికి సక్రమంగా రేషను సరుకులను పంపిణీ చేసేందుకు స్మార్ట్‌రైస్ కార్డులను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. అదేవిధంగా వలపర్ల గ్రామంలో 2992 మందికి రైస్‌కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ టి ప్రశాంతి, సొసైటీ చైర్మన్ కంభంపాటి హనుమంతరావు, సర్పంచ్ తాళ్లూరి బ్రహ్మయ్య, పర్చూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ వెలగా రామాంజనేయులు, జంజనం సుబ్బారావు, గుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ పరిదిలోని 180 మందికి రూ.1.03 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పర్చూరు మార్కెట్ యార్డు చైర్మన్ గుంజి వెంకట్రావు,షేక్ రజాక్, కామినేని జనార్దన్, తేలప్రోలు సాంబశి వరావు, కమ్మ శివనాగేశ్వరరావు,కోటపాటి సురేష్, కామేపల్లి హరిబాబు, మిన్నెకంటి రవికుమార్, తొండెపు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
బల్లికురవ : కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ ద్వారా మహిళకు ఉచితంగా పరీక్షలు చేసి మందులను అందజేస్తామని గుంటుపల్లి ప్రాధమిక అరోగ్య కేంద్రం వైద్యాధికారి రవితేజ తెలిపారు. బుధవారం ప్రాధమిక అరోగ్య కేంద్రంలో సుమారు వందమందిని పరీక్షించారు. మహిళలకు బలవర్ధకమైన పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అక్టోబరు 2 వరకు అన్ని గ్రామాలలో ఈ క్యాంపులు చేపడతామన్నారు. రక్తపోటు, ముధమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్బాశయ క్యాన్సర్ తదితర పరీక్షలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైద్యాదికారులు రమీజ్ అహ్మద్, భారతీ, మమత, సిబ్బంది పాల్గొన్నారు.
చినగంజాం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వాయ్యంతో ప్రవేశ పెట్టిన స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఎన్.విజయ, సంతరావూరు పీహెచ్‌సీ వైద్యాధికారి కే.కీర్తిసరోజ్‌లు అన్నారు. మండలంలోని సంతరావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాల కోసం వైద్య శిబిరాలు బుధవారం నుండి అక్టోబరు 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో సంతరావూరు పీఏసీఎస్ చైర్‌పర్సన్ యార్లగడ్డ లక్ష్మి, గ్రామ కార్యదర్శి కె.కృపారావు, పీ.హెచ్.సీ ఎంపీహెచ్‌ఈవో యూ.వెంకటరమణ, హెచ్‌ఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.