Share News

ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల్లో ఆనందం

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:04 AM

ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆనందంగా ఉన్నారని ఎమ్మె ల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థా నిక ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం సా యంత్రం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకాన్ని (ఉచిత బస్సు ప్రయాణం) ఎమ్మెల్యే కందుల ప్రారంభించారు.

ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల్లో ఆనందం
మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆనందంగా ఉన్నారని ఎమ్మె ల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థా నిక ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం సా యంత్రం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి పథకాన్ని (ఉచిత బస్సు ప్రయాణం) ఎమ్మెల్యే కందుల ప్రారంభించారు. ఈ సందర్బంగా బస్సును ప్రారంభించి మహిళా ప్రయాణికులకు టిమ్స్‌ ద్వారా టికెట్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్నిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, యువ నాయకుడు నారా లోకేష్‌ సారధ్యంలో అన్ని పథకాలు అమలవుతున్నాయన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అలమలు చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్‌రెడ్డి టీం అవాస్తవ ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. వైసీపీ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని కందుల పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం నరసింహులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, బీసీ నాయకులు డి.మస్తానయ్య, గులాబ్‌ పాల్గొన్నారు.

పొదిలి : మహిళల సంక్షేమమే ధ్యే యంగా ప్రభుత్వం పని పనిచేస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నా రు. పొదిలి డిపోలో స్ర్తీశక్తి పథకాన్ని ఆ యన ప్రారంభించారు. మహిళలు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డ్‌తో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. తొలుత తల్లికివందనం, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆనందం గా ఉన్నారన్నారు. కార్యక్రమంలో డిపో వేనేజర్‌ శంకరరావు, సీఐ ధనలక్ష్మి, టీడీపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గిద్దలూరులో ప్రారంభించిన

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

సీఎం చంద్రబాబు చిత్రపటానికి

మహిళల పాలాభిషేకం

గిద్దలూరు టౌన్‌ : మేలు చేసిన ప్రభుత్వాన్ని మరచిపోరాదని, మీరంతా దీవించాలి అని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహిళలకు అమలు చేసిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి రిబ్బన్‌ కట్‌ చే సి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో నిర్వహించిన ఈకార్యక్రమానికి మహిళలు భారీగా తరలివచ్చారు. వారం తా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు ఉచిత బ స్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని అన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం మహిళలతో కలిసి ఎమ్మె ల్యే బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశా రు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి బె ల్లంకొండ సాయిబాబా, మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, మా ర్కెట్‌యార్డు చైర్మన్‌ బైలడుగు బాలయ్య, ఆర్టీసీ ఇన్‌చార్జి డీఎం షేక్‌ మౌనిక, మున్సిపల్‌ కమిషనర్‌ ఇ.వి.రమణ, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 12:04 AM