మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:11 AM
మహిళ మెడలోని బంగారు గొలుసు ను మోటార్‌సైకిల్ వచ్చిన ఓ అగంతకుడు లాక్కెళ్లాడు. ఈ ఘటన ఒంగోలు నగరం శ్రీనగర్‌కాలనీలో 4వ లైన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.

ఒంగోలు క్రైం, జూన్10(ఆంధ్రజ్యోతి): మహిళ మెడలోని బంగారు గొలుసు ను మోటార్‌సైకిల్ వచ్చిన ఓ అగంతకుడు లాక్కెళ్లాడు. ఈ ఘటన ఒంగోలు నగరం శ్రీనగర్‌కాలనీలో 4వ లైన్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సీతాలక్ష్మి, అమె చెల్లెలు కలిసి ఆసుప త్రికి వెళ్ళి చికిత్స చేయించుకుని మెడికల్ షాపులో మందుల తీసుకుని ఆటోలో ఇంటికి బయలుదేరారు. వారు ఇంటి వద్ద ఆటో దిగి లోపలికి వెళ్లే సమయంలో పోతురాజు కాలువ వైపు నుంచి 30 ఏళ్ళ వయస్సుగల యువకుడు టోపీ, మాస్క్ ధరించి మోటార్‌సైకిల్‌పై వచ్చి సీతాలక్ష్మి మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసు ఒక్కసారిగా లాక్కోని వెళ్ళాడు. దీంతో వారు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చేసరికి అగంతుకుడు అక్కడి నుంచి పరారీ అ య్యాడు. అనంతరం బాధితురాలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.