మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - May 27 , 2025 | 11:01 PM
దర్శి, మండలంలోని తూర్పువీరాయపాలెంలో మంగళవారం మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
దర్శి, మే 27 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తూర్పువీరాయపాలెంలో మంగళవారం మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం.. సీహెచ్ వెంకటరత్నం(30) భర్త మందలించడంతో మనస్తాపం చెంది, ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంకటరత్నం తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.