Share News

బస్సులో నుంచి జారిపడి మహిళ మృతి

ABN , Publish Date - Oct 12 , 2025 | 10:58 PM

ఆర్టీసీ బస్సులో నుంచి జారిపడి మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం త్రోవగుంటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరానికి చెందిన మంచికల కుమారి(42) మృతి చెందింది.

బస్సులో నుంచి జారిపడి మహిళ మృతి

ఒంగోలు క్రైం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్సులో నుంచి జారిపడి మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం త్రోవగుంటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరానికి చెందిన మంచికల కుమారి(42) మృతి చెందింది. వివరాలలోకి వెళితే... కుమారి ఆమె కుమార్తె స్నేహ రోసిలిన్‌తో కలిసి కల్వర్‌ టెంపుల్‌కు వెళ్లారు. అక్కడ నుంచి ఒంగోలు వెళ్లి షాపింగ్‌ చేశారు. ఆర్టీసీ బస్సుఎక్కి ఒమ్మెవరం వెళుతుండగా మార్గమధ్యలో త్రోవగుంట బస్సు వెళ్లిన తరువాత కుమారి సెల్‌ ఫోన్‌ కనిపించలేదు. దీంతో హడావిడిగా వచ్చి డ్రైవర్‌ను బస్సు ఆపాలని అడిగింది. డ్రైవర్‌ ఆపేలోపే హడవిడిగా బస్సు దిగేందుకు ప్రయిత్నించి కింద పడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన కుమారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలి కుమారుడు నాగ్రేంద కుమార్‌ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ విషయంలో హత్యాయత్నం

ఒంగోలు క్రైం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి) : మహిళ విషయంలో ఇరువురు గొడవపడి ఒకరు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన కర్నూలురోడ్డులోని ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ వద్ద ఉన్న పార్కులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... పేర్నమిట్ట పరిధిలోని దామచర్ల ఆంజనేయులు కాలనీలో నివాసం ఉండే నలబోతుల శ్రీను ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అదే కాలనీలో నివాసం ఉండే పాలపర్తి సత్యం ఆమె పట్ల చనువుగా ప్రవర్తించాడు. రెండు రోజుల క్రితం శ్రీను, పాలపర్తి సత్యాన్ని తీవ్రంగా హెచ్చరించాడు. అదిమనసులో పెట్టుకున్న శ్రీను ఆదివారం తిరిగి సత్యం స్థానిక కర్నూలురోడ్డులోని ఇండస్ట్రీయిల్‌ ఎస్టేట్‌ వద్ద ఆంజనేయస్వామి విగ్రహం వెనుక ఉన్న పార్కులో ఉండగా కత్తితో పొడిచే ప్రయత్నం చేశాడు. సత్యం చేయ అడ్డుగా పెట్టిన చాతి వద్ద కత్తి తగిలి రక్తస్రావమైంది. ఈ మేరకు జీజీహెచ్‌లో చేరి అక్కడ అవుట్‌ పోస్టు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 10:58 PM