నూతన ఉపాధ్యాయులతో.. పాఠశాలలు కళకళ
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:59 PM
మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 44 మంది ఉపాధ్యాయులు సోమ వారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో చేరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్టుకూడా భర్తీచేయలేదు. ప్రజా ప్రభుత్వంలో మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయులను నియమించారు.
మండల పరిషత్ బడుల్లో తీరని కొరత
దొనకొండ మండలానికి 44 మంది కేటాయింపు
దొనకొండ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 44 మంది ఉపాధ్యాయులు సోమ వారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో చేరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్టుకూడా భర్తీచేయలేదు. ప్రజా ప్రభుత్వంలో మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయులను నియమించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో 57 ప్రాథమిక, ఒకటి ప్రాథమికోన్నత, 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 5177 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక పాఠ శాలల్లో 52 మంది సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులు, ఉ న్నత పాఠశాలల్లో 34 మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. దీంతో అనేక ప్రాథమిక పాఠశా లలు ఏకోపాధ్యాయుడితో బోధనలు జరుగుతున్నాయి. పలు ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరతను విద్యా ర్థులు ఇప్పటివరకు ఎదుర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వా రా వీరి కొరతను ప్రజా ప్రభుత్వం తీర్చింది.
మండలంలోని ఎనిమిది జడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు 3, హిందీ 2, ఇంగ్లీష్ 6, లెక్కలు 6, ఫిజికల్ సైన్స్ 1, బయాలజికల్ సైన్స్ 4, సోషల్ 6, పీఈటీ 6 మొత్తం 34 మంది నూతనంగా ఎంపికైన ఉపాధ్యా యులు విధుల్లో చేరాయి. దీంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెట్ టీచర్ల కొరత తీరి నూతన ఉపాధ్యాయులతో కళకళలాడుతున్నాయి. 57 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 52 మంది ఉపాధ్యాయుల కొరత ఉంటే కేవలం పది మంది నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఉపా ధ్యాయుల కొరత ఉంది.
ఈసందర్భంగా ఎంఈవో ఎన్.సాంబశివరావు మా ట్లాడుతూ దొనకొండ మండలంలోని ఎనిమిది జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రజాప్రభుత్వం నిర్వహించిన మె గా డీఎస్పీ ద్వారా నూతన ఉపాధ్యాయులు చేరారు. ఇప్పటివరకు విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరింది. అందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
పామూరుకు 20 మంది
పామూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మోగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరారు. ఈసందర్భంగా వారికి ఎంఈవో పి. కోటిరెడ్డి శుబాకాంక్షలు తెలిపారు. మండలంలోని ఉన్న త పాఠశాలలకు 20 మంది ఉపాధ్యాయులను కేటా యించారు. అందులో పామూరు ప్రభుత్వ ఉన్నత పా ఠశాలకు ఏడుగురిని నియమించారు. అలాగే, సీఎస్ పురం మండలంలో విధుల్లో చేరిన నూతన ఉపాధ్యా యులను ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాయ బ్‌రసూల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
పీసీపల్లిలో 14 మంది
పీసీపల్లి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ ద్వారా ఎంపికైన 14 మంది ఉపాధ్యాయులను మండలానికి కేటాయించారు. సోమవారం వీరు విధుల్లో చేరారు. స్కూల్ అసిస్టెంట్‌లు 11మంది, ఎస్‌జీటీలు ముగ్గురిని మండలానికి నియమించారు. సోమవారం ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవోలు సంజివి, శ్రీని వాసరావును కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. అనంతరం వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరారు.
ముండ్లమూరుకు 20 మంది
ముండ్లమూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 20 మంది ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలల్లో సోమవారం విధుల్లో చేరారు. ఎంఈవో షేక్ కాలేషావలికి జాయినింగ్ రిపో ర్టు అందజేశారు. నూతన ఉపాధ్యాయులకు యూ టీఎఫ్, ఏపీటీఎఫ్ సంఘాలు స్వాగతం పలికాయి.
తాళ్లూరులో 13 మంది
తాళ్లూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ లో ఎంపికైన 13 మంది ఉపాధ్యాయులు వారికి కేటా యించిన పాఠశాలల్లో సోమవారం విధుల్లో చేరారు. స్థానిక విద్యావనరులకేంద్రంలో ఎంఈవో జి.సుబ్బయ్యకు జాయినింగ్ ఆర్డర్‌లు అందజేశారు. వీరి చేరికతో కొంతమేర ఉపాధ్యాయుల కొరత తీరింది.