Share News

కుందంపల్లికి రోడ్దేసేదెప్పుడో..?

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:10 PM

మండలంలోని కుందంపల్లి రోడ్డు అధ్వానంగావు ఉంది. ఏడేళ్ల కిందట చేపట్టిన పనులు నేటికి కూడా మొదలు పెట్టిన పాపాన పోలేదు. దీంతో నిత్యం ప్రజలు రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. కుందంపల్లికి రోడ్డు ఏప్పుడు వేస్తారోనని ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల కిందట వైసీపీ పాలకులు తట్టెడు మట్టిని వేసిన పాపాన పోలేదు.

కుందంపల్లికి రోడ్దేసేదెప్పుడో..?
అఽధ్వానంగా ఉన్న కుందంపల్లి రహదారి

2019లో శంకుస్థాపన

ఏళ్లుగా నిలిచిన పనులు

రాకపోకలకు ఇబ్బందులు

పుల్లలచెరువు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కుందంపల్లి రోడ్డు అధ్వానంగావు ఉంది. ఏడేళ్ల కిందట చేపట్టిన పనులు నేటికి కూడా మొదలు పెట్టిన పాపాన పోలేదు. దీంతో నిత్యం ప్రజలు రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. కుందంపల్లికి రోడ్డు ఏప్పుడు వేస్తారోనని ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల కిందట వైసీపీ పాలకులు తట్టెడు మట్టిని వేసిన పాపాన పోలేదు. గత టీడీపీ హయంలో కుందంపల్లి గ్రామస్థుల ఇబ్బందులను గుర్తించి 2018లో ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు మం జూరు చేశారు. అప్పటి కాంట్రాక్టరు ఎన్నికల కారణంగా పనులు మొదలు పెట్టలేదు. జగన్‌రెడ్డి వచ్చాక 2020 జనవరి 14న అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్‌ అట్టహాసంగా శం కుస్థాపన చేశారు. ఆ తరవాత వెంటనే కాం ట్రాక్టరు పనులు మొదలు పెట్టి చిప్స్‌ పరిచారు. అయినా వైసీపీ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులను నిలిపివేశారు. అప్పటి నుంచి పనులు పూర్తిగా నిలిపివేయడంతో కుందంపల్లి గ్రామస్థులు వర్షం పడినప్పుడు బురదలో, మిగిలిన రోజుల్లో గాలి, దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన రోడ్డుకు నేటీకి కుడా పనులు పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కుందంపల్లి రోడ్డు పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:10 PM