Share News

అమృత్‌ పథకం అమలు ఎప్పుడో..!

ABN , Publish Date - Oct 09 , 2025 | 10:25 PM

దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే సంకల్పంతో కేంద్రప్రభుత్వం అమృత్‌ పథకం ద్వారా అందించిన నిధులతో ఏర్పాటుచేయతలపెట్టిన ఇంటింటికి కొళా యి పథకం అడుగు ముందుకు పండ టంలేదు. పనులు ఎప్పుడు ప్రారంభమ వుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

అమృత్‌ పథకం అమలు ఎప్పుడో..!
దర్శి పట్టణ వ్యూ

గత మూడేళ్లుగా వాయిదా పడుతున్న వైనం

దర్శి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే సంకల్పంతో కేంద్రప్రభుత్వం అమృత్‌ పథకం ద్వారా అందించిన నిధులతో ఏర్పాటుచేయతలపెట్టిన ఇంటింటికి కొళా యి పథకం అడుగు ముందుకు పండ టంలేదు. పనులు ఎప్పుడు ప్రారంభమ వుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 జూన్‌లో అమృత్‌ పథకం కింద రూ.121 కోట్లు మంజూరయ్యాయి. ఆనాటి పాలకుల అసమర్థతో చాలాకాలం టెండర్లు ఖరారుకు నోచుకోలేదు. ఆతర్వాత 2024 మార్చిలో టెండర్లు ఖరా రు చేశారు. ఆవెంటనే ఎన్నికలు రావటంతో సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించలేదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లు రద్దు చేసింది. ఆతర్వాత అంచనా లు పెంచి రూ.130.60 కోట్లతో గత జూలైలో మళ్లీ టెండర్లు పిలిచారు. ఈసారి మూడు జిల్లాల యూనిట్‌గా టెం డర్లు పిలవటంతో పెద్ద కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లు వేయగలిగారు. ఆతర్వాత మళ్లీ ఏ కారణంచేతనో రెండోసారి వేసిన టెండర్లు కూడా రద్దయ్యాయి. ప్రస్తు తం రాష్ట్రవ్యాప్తంగా అమృత్‌ పథకం అమలు రాష్ట్రప్ర భుత్వ నిర్ణయంపై ఆధారపడిఉంది. మళ్లీ ఎప్పుడు టెండర్లు పిలుస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

దర్శి మున్సిపాలిటీలో సుమారు 40వేల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరు అంది స్తున్నప్పటికీ ఫిల్టర్లు సరిగా పనిచే యక అన్నిప్రాంతాలకు నీరందక శివారు ప్రాంతాల ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. ముండ్లమూరు మండలంలోని పులిపాడు చెరువును మంచినీటి చెరువుగా మార్చి సాగర్‌ జలాలను ఆ చెరువుకు నింపి ఫిల్టర్‌ చేసి పైపులైన్ల ద్వారా దర్శి పట్టణ ప్రజలకు ఇంటింటికి కొళాయి ద్వారా నీరందించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. అయితే, ఆచరణలో అమలు కా కపోవటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు.

గత వైసీపీ పాలకుల అసమర్థతో పథకం నిర్మా ణానికి నోచుకోకపోవటం తెలిసిందే. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక కూడా జాప్యం జరగటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రజల అవసరాలను గుర్తించి ఈపథకం త్వరగా ప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవా లని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 09 , 2025 | 10:25 PM