Share News

మంత్రి స్వామి ఉపాధ్యాయుడైన వేళ..

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:31 PM

వైద్యునిగా ఎంతోమంది రోగులకు వైద్యసేవలు అందించిన ఆయన అనుకోని పరిణామాల నేపథ్యంలో శాసనసభకు పోటీ చేసి మూడుసార్లు హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బిజీబిజీగా గడిపే రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి స్వామి ఒక్కసారిగా ఉపాధ్యాయుని అవతారం ఎత్తారు.

మంత్రి స్వామి ఉపాధ్యాయుడైన వేళ..
కూచిపూడి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మంత్రి మాటామంతీ

విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగిన డాలా

కూచిపూడి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి

మర్రిపూడి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : వైద్యునిగా ఎంతోమంది రోగులకు వైద్యసేవలు అందించిన ఆయన అనుకోని పరిణామాల నేపథ్యంలో శాసనసభకు పోటీ చేసి మూడుసార్లు హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బిజీబిజీగా గడిపే రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి స్వామి ఒక్కసారిగా ఉపాధ్యాయుని అవతారం ఎత్తారు. పాఠశాల విద్యార్థులతో మమేకమై సందడి చేశారు. పసిపిల్లలతో సరదాగా కాసేపు ప్రశ్నలు సంధిస్తూ వారిని ఉత్తేజపరిచారు. శనివారం మర్రిపూడిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందకు వస్తున్న మంత్రి కూచిపూడి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. చాలీచాలని గదులలో ఇబ్బందులను పడుతున్న విద్యార్థులను చూసి చలించిపోయారు. తరగతి గదులు లేకపోవడంతో తాత్కాలికంగా మండలపరిషత్‌ నిధుల నుంచి రేకులషెడ్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరలో నూతన భవనాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సర్వేపల్లి రాధక్రిష్ణ విద్యార్థిమిత్ర కిట్లను పరిశీలించారు దుస్తులు, బూట్ల నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కాసేపు సరదగా ముచ్చటించారు. వారి విద్యానైపుణ్యాన్ని తెలుసుకునేందకు తెలుగుపాఠ్యాంశంలోని పలుప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. డాక్టర్‌గా, ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న స్వామి ఉపాధ్యాయుని అవతారం ఎత్తడంతో స్థానికులు కూడా ఆనందించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి, టీడీపీ నాయకులు వెంకటరెడ్డి, హనుమారెడ్డి, తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:31 PM