Share News

తహసీల్దార్‌ కార్యాలయంలో ఏం జరుగుతోంది ?

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:59 PM

వేటపాలెం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో గత రెండు రోజులుగా ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదు.

తహసీల్దార్‌ కార్యాలయంలో ఏం జరుగుతోంది ?

వేటపాలెం(చీరాల), జూన్‌ 15 (ఆంధ్ర జ్యోతి) : వేటపాలెం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో గత రెండు రోజులుగా ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదు. తహసీ ల్దార్‌ పార్వతిని రెండు రోజుల క్రితం సీసీఎల్‌ఏకు సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ వెంకట మురళీ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే తాజాగా డీటీ శ్రీకాంత్‌ను డిప్యుటేషన్‌పై నిజాంపట్నా నికి పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మరో రెండు రోజుల్లో ఇద్దరు వీఆర్‌వోలపై వేటు పడనుందని, ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే చీరాల తహసీ ల్దార్‌ గోపీకృష్ణకు వేటపాలేనికి ఇన్‌చార్జ్‌గా అదనపు బాఽధ్యతలు అప్పగించారు.

ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు

కొంతకాలంగా వేటపాలెం, కొత్తపేట, రామాపురం ప్రాంతాల్లోని ప్రభుత్వ భూము లను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు తహసీల్దార్‌ పార్వతి, డీటీ శ్రీకాంత్‌, మరో ఇద్దరు వీఆర్‌వోలు ప్రయత్నించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అంతే కాకుండా ఉన్నతాధికారుల విచారణలో నూ తహసీల్దార్‌ పార్వతి విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలిసింది. ఈక్రమంలో ఇటీవల కొంతమేరకు ఉన్నతాధికారులు వేటపాలెం రెవెన్యూ కార్యాలయంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే అనునిత్యం మండలంలో భూఆక్రమణలు, అనఽధికార రిసార్ట్స్‌, అక్రమ లేఅవుట్ల వ్యవహారాలతో ఇక్కడి అధికారులు పత్రికలకెక్కుతూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక అధికారి తీరు చర్చనీయాంశంగానే ఉంటుం ది. ఈక్రమంలో తాజాగా మండల కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో బదిలీల వ్యవహారం హాట్‌ టాఫిక్‌గా మారింది.

Updated Date - Jun 15 , 2025 | 11:59 PM