Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:32 AM

అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పేర్కొన్నారు. సుపరిపాలన కు తొలిఅడుగు కార్యక్రమాన్ని బుధవారం నగ రంలోని 30, 32వ డివిజన్‌లలో నిర్వహించా రు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ఎమ్మెల్యే దామచర్ల

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 9 (ఆంధ్రజ్యో తి): అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పేర్కొన్నారు. సుపరిపాలన కు తొలిఅడుగు కార్యక్రమాన్ని బుధవారం నగ రంలోని 30, 32వ డివిజన్‌లలో నిర్వహించా రు. ఈ సందర్భంగా దామచర్ల ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకోగా కొందరు పింఛ న్లు, ఇంటి స్థలాలు, రేషన్‌కార్డుల లేవని ఎమ్మె ల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయా డివిజన్లలోని సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వాటిని సత్వరమే పరిష్కరించాలని కార్పొరేషన్‌ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు తూ ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు. అందుకోసం ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. తాను కూడా డివిజన్‌లలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి, అవసరమైన పథకాలు అందరికీ చే యాలన్నదే లక్ష్యమన్నారు. పేదరికం లేని స మాజ స్థాపన కోసం ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ అమలు చేస్తుందని వివరించారు. గత ప్రభు త్వం అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక పిల్లవా డికే డబ్బులు ఇవ్వగా నేడు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమం దికి రూ.13వేలు ఇచ్చిన ఘనత కూటమి ప్ర భుత్వానిదే అన్నారు. అలాగే ఉచిత గ్యాస్‌ సిలి ండర్‌లు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయా ణం, పింఛన్లు పెంపు తదితర పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథ కాల కోసం అర్హులు తమ దరఖాస్తులను సచి వాలయంలో అందజేయాలని ఎమ్మెల్యే సూ చించారు. కార్యక్రమంలో నగర కమిషనర్‌ కె. వెంకటేశ్వరరావు, డివిజన్‌ అధ్యక్షుడు నత్తల క నకరావు, నత్తల శ్రీనివాసరావు, మాజీ కౌన్సి లర్‌ తూము సుబ్బారావు, కంకణాల వెంకట్రా వు, ఆరిగ శంకర్‌, ఆరిగ శైలజ పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:33 AM