Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 10:27 PM

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా అర్హులైన ప్రతిఒక్కరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
పీసీపల్లిలో సంక్షేమ పథకాల గురించి మహిళలకు వివరిస్తున్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

పీసీపల్లి, జూలై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా అర్హులైన ప్రతిఒక్కరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఆది వారం పీసీపల్లిలో ఇంటింటికి తిరిగి ప్రజా సమ స్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.

ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయమాటలతో ఐదేళ్లు కాలం వెళ్లదీసిందన్నారు. గత ప్రభుత్వంలో పీసీపల్లి ప్రధాన రోడ్డు అడుగుకో గుంత మూరకో గోయ్యిలా ఉందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత రూ.3 కోట్లతో సీసీరోడ్లు వేయించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారాన్నరు. పేదలందరికీ ఆర్ధిక భరోసా కల్పించేందుకు పీ4ను తీసుకొచ్చారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేమారి రామయ్య, యారవ శ్రీను, సుబ్బారావు, శివరా మయ్య, ఎబినేజరు, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలి

పీసీపల్లి, జూలై 6(ఆంధ్రజ్యోతి): కార్యకర్తలు కలిసికట్టుగా టీడీపీ పటిష్టతకు కృషిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నా రు. ఆదివారం పీసీపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంఽక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో పథకాలు అర్హులైన వారికి అందుతున్నప్పటికీ అవి ప్రజలకు తెలియ డంలేదని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రూపులు కట్టి పార్టీకి నష్టం చేకూర్చాలని చూస్తే వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదన్నారు. అటువంటివారిపై పార్టీపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య, యారవ శ్రీను, పెద్దన్న, పువ్వాడి నాగరాజు, గోగాడ రత్నయ్య, పోలం లక్ష్మీదేవి పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 10:27 PM