ఏడాదిలో ప్రతి ఇంటికీ సంక్షేమం
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:39 PM
ప్రజా ప్రభుత్వ పాలనలో పలు పథకాల ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మున్సిపాల్టీ పరిధిలోని 7వ వార్డు కొత్తూరులో ఏడాది సుపరిపాల న కార్యక్రమం ప్రచారంలో భాగంగా శుక్రవారం మంత్రి ఇంటింటినీ సందర్శించారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి
కనిగిరి, జూలై 11(ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వ పాలనలో పలు పథకాల ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మున్సిపాల్టీ పరిధిలోని 7వ వార్డు కొత్తూరులో ఏడాది సుపరిపాల న కార్యక్రమం ప్రచారంలో భాగంగా శుక్రవారం మంత్రి ఇంటింటినీ సందర్శించారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో అందిన సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ పేద కుటుంబాలు తమ పిల్లలందరికీ ఉన్నత చదువులు చదివించుకోవాలనే ఆశను సీఎం చంద్రబాబు నెరవేర్చారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌రెడ్డి వైఖరితో రాష్ట్రం దివాళా దిశగా చేరుకుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర ఖజానాను తన సొంత జేబులోకి వేసుకుని పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదిశగా సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సొమ్మును పెంచి అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లను అందజేస్తున్నట్టు తెలిపారు. కనిగిరిలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చొరవతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, తెలుగుయువత పట్టణ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, డీఈ ఉమాకాంత్ పాల్గొన్నారు.
రైతులకు డ్రోన్‌లు పంపిణీ చేసిన మంత్రి, ఎమ్మెల్యే
రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. శుక్రవారం కొత్తూరు గ్రామంలో కనిగిరి, సీఎ్‌సపురం, వెలిగండ్ల మండలాలకు చెందిన రైతులకు రూ.30 లక్షలు విలువ చేసే మూడు డ్రోన్‌లను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా వ్యవసాయరంగంలో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వివిధ రకాల పనిముట్లను సబ్సిడీపై అందజేస్తోందన్నారు. ఇప్పటికే ట్రాక్టర్‌లు, స్ర్పేయర్‌లు, వివిధరకాల వ్యవసాయ పనిముట్లు అందించినట్టు చెప్పారు. డ్రోన్ సాయంతో తుంపర సేద్యం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రైతులు డ్రోన్ పరిమాణాన్ని బట్టి సాగులోని పంటకు ఎలాంటి మందు అవసరమో తగిన మోతాదులో నింపుకుని డ్రోన్‌ను వినియోగించాలని చెప్పారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లలేకుండా డ్రోన్ వ్యవసాయం, వాటివల్ల చేకూరే లాభాలను ఎప్పటికప్పడు సమీక్షించి పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఏడీఏ జైనులాబ్దిన్ పాల్గొన్నారు.