Share News

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jun 12 , 2025 | 11:28 PM

సుపరిపాలనతో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుందని ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. గురువారం స్థానిక అమరావతి ప్రాంగణంలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. కేకు కట్‌చేసి శ్రేణులకు పంచిపెట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు.

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
ఏడాదిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పోస్టర్‌ను అవిష్కరిస్తున్న ఎమ్మెల్యే, నాయకులు

కనిగిరి ప్రాంతంలో ఏడాదిలో ఎన్నో పనులు

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): సుపరిపాలనతో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుందని ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. గురువారం స్థానిక అమరావతి ప్రాంగణంలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. కేకు కట్‌చేసి శ్రేణులకు పంచిపెట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. గత ఐదే ళ్ళ వైసీపీ పాలనలో జగన్‌ ప్రభుత్వం రాక్షస పాలన సాగించిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన త ప్పులకు రాష్ట్రం ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడిందన్నారు. ఈ తరుణంలో ఏడాదిగా సీఎం చంద్రబాబు ఎన్నో ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటూ సంక్షేమం, అభివృద్ధి రెం డు కళ్ళుగా పాలన సాగించి ప్రజల మన్ననలను పొం దారన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి పశ్చిమ ప్రకాశాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఆ యన అడుగుజాడల్లో నడుస్తున్న తాను కనిగిరి అభి వృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. అందులోభాగంగానే రై ల్వేలైన్‌, బైపాస్‌, రిలయన్స్‌ బయోగ్యాస్‌, కంగారు మ దర్‌కేర్‌ సెంటర్‌, సాగర్‌నీటి సరఫరాలో అంతరాయా లను తొలగించేందుకు ప్రత్యేకంగా నూతన పైపులైన్‌లు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కనిగిరి ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో అనునిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కనిగిరిలో రైతుబజార్‌ , ట్రిపుల్‌ఐటీ, గన్నవరం బ్రిడ్జ్‌ వం టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. అనంతరం ఏడాదిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పోస్టర్‌ను విడుదల చేశారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, పిచ్చాల శ్రీనివా సులురెడ్డి, నారపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తమ్మినేని శ్రీని వాసులరెడ్డి, ఫిరోజ్‌, ముచ్చుమూరి చెంచిరెడ్డి, బాలు ఓబులు రెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, తిరుపాలు, నజిముద్దీన్‌, తెలుగుమహిళలు కరణం అరుణమ్మ, షేక్‌ వాజిదాబేగం తదితరులు పాల్గొన్నారు.

పీసీపల్లి : కూటమి ప్రభుత్వం ఏర్ప డి ఏడాదైన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రే ణులు గురువారం పీసీప ల్లిలో సంబరాలు జరుపు కున్నారు. కేకును కట్‌చేసి శ్రేణులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రా మయ్య, తదితరులు పాల్గొన్నారు.

పామూరు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గురువారం స్థానిక టీడీపీ కా ర్యాలయంలో ఆపార్టీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెం కటేశ్వర్లు కేకు కట్‌ చేశారు. కార్యక్రమంలో ఏ.ప్రభార్‌చౌ దరి, ఉప్పలపాటి హరిబాబు, ఎన్‌. సాంబయ్య, సర్పం చ్‌ కొండబాబు, బీజేపీ నాయకుడు కేవీ రమణయ్య, జనసేన నాయకులు వై .రహీముల్లా, ఫత్తు మస్తాన్‌, తదితరులు పాల్గొన్నారు.

వెలిగండ్ల : వెలిగండ్లఓని టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌చేసి సం బరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర కా ర్యదర్శి దొడ్డావెంకట సబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి, కొండు భాస్కర్‌రెడ్డి, చిలకల వెంకటేశ్వర్లు, కేసరి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముండ్లమూరు : కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుం దని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి నేటికి ఏడాది కావటంతో గురువారం మం డలంలోని శంకరాపురం నుంచి ముండ్లమూరు వరకు ఎనిమిది కిలో మీటర్లు దాదాపు రెండు వేల మోటారు సైకిళ్ళతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముండ్ల మూరు బస్టాండ్‌ సెంటర్‌లో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి భారీ కేక్‌ కట్‌ చేశారు. ఈసందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు అభివృద్ధి ఫలాలు, మరోవైపు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. ఏడాది లో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్‌ - 6 హామీల్లో ఇప్పటికే 75 శాతం హామీలను నెరవేర్చి రాష్ట్రాన్ని స్వ ర్ణాంధ్రప్రదేశ్‌ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకెళుతున్నారని అన్నారు. దర్శి నియోజక వర్గంలో ఏడాదిలో కాలంలోనే రూ.130 కోట్లు మంజూ రు చేయించి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తాను ముందుండి అండగా నిలుస్తాన న్నారు. దర్శి నియోజక వర్గానికి త్వరలోనే అనేక పరిశ్రమలు తీసుకురావటం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ లలిత్‌సాగర్‌, ఏఎం సీ చైర్మన్‌ దారం నాగవేణి సుబ్బారావు, మునిసిపల్‌ చైర్మన్‌ నారపశెట్టి పిచ్చ య్య, టీడీపీ మండల అ ధ్యక్షుడు కూరపాటి శ్రీనివా సరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, తాళ్ళూరు, దర్శి, కురిచేడు, దొనకొండ మండల అధ్య క్షులు వెంకటేశ్వరరెడ్డి, మో డి ఆంజనేయులు, వెంకటే శ్వర్లు, నెమలయ్య, తది తరులు పాల్గొన్నారు.

దొనకొండలో.. దొనకొండ, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సంద ర్భంగా స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు మోడి ఆంజనేయులు ఆధ్వర్యంలో గురువా రం వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కేకు కట్‌చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాగులపాటి శివకోటేశ్వరరావు, పులిమి రమణ యాదవ్‌, వడ్లమూడి చెన్నయ్య, శృంగారపు నాగసుబ్బారెడ్డి, పత్తి వెంక టేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 11:28 PM