Share News

హెల్మెట్లు ధరించడం అందరి బాధ్యత

ABN , Publish Date - Sep 13 , 2025 | 10:21 PM

హెల్మెట్లు ధరించడం ప్రాణాలకు రక్షణ అని, ఇది అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గిద్దలూరు సర్కి ల్‌ పరిధిలోని గిద్దలూరు,

హెల్మెట్లు ధరించడం అందరి బాధ్యత

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పోలీసులకు పంపిణీ

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 13 (ఆం ధ్రజ్యోతి): హెల్మెట్లు ధరించడం ప్రాణాలకు రక్షణ అని, ఇది అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గిద్దలూరు సర్కి ల్‌ పరిధిలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు పోలీసులకు వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు సమకూర్చిన హెల్మెట్లు, వాటర్‌బాటిల్స్‌, క్యాప్‌లను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదం జరిగితే కుటుంబం అనాథ అవుతుందని, యువత మోటార్‌ వాహనాలపై అతివేగంగా వెళ్లడం చాలా ప్రమాదమని తెలిపారు. తల్లిదండ్రులు తమపిల్లల పట్ల జాగ్రత్తలు వహిస్తూ వారిని హెచ్చరిస్తూ ఉండాలని సూచించారు. కంభం సీఐ మల్లికార్జున మాట్లాడుతూ ఇటీవల ఓ కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదానికి గురై తలకు బలమైన గాయం కావడంతో మంచానికి పరిమితం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని సంస్థ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు స్పందించి పోలీసులకు హెల్మెట్లు అందించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. సమావేశంలో గిద్దలూరు అర్బన్‌ సీఐ కె.సురేష్‌ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని, ప్రజలకు కూడా హెల్మెట్లు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ రామకోటయ్య, పట్టణ పార్టీ అధ్యక్షు డు సయ్యద్‌ షానేషావలి, మండల పార్టీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ బైలడుగు బాలయ్య, వైస్‌ చైర్మన్‌ గోడి ఓబులరెడ్డి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, బిజ్జం రవీంద్రరెడ్డి, రాష్ట్ర ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ గోన చెన్నకేశవులు, టీడీపీ నాయకులు అంబవరం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

3

Updated Date - Sep 13 , 2025 | 10:21 PM