Share News

విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తా

ABN , Publish Date - Sep 10 , 2025 | 10:15 PM

రాష్ట్రంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కార్పొరేషన్‌ ద్వారా కృషి చేస్తామని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కమ్మరి పార్వతమ్మ తెలిపారు.

విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తా
పార్వతమ్మను సన్మానిస్తున్న కంభం విశ్వబ్రాహ్మణ సంఘం

కంభం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కార్పొరేషన్‌ ద్వారా కృషి చేస్తామని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కమ్మరి పార్వతమ్మ తెలిపారు. విజయవాడ నుంచి కర్నూలు వెళ్తూ కంభం పట్టణంలోని చెరుకుపల్లి సుబ్రహ్మణ్యం (సూపర్‌స్టార్‌) గృహానికి రాగా కంభం మండల విశ్వబ్రాహ్మణుల సంఘ చైర్మన్‌ ఆమెను మాట్లాడారు. జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతమైన కంభం మండలంలో చేతివృత్తులతో జీవనం సాగిస్తున్న 100 కుటుంబాలు ఉన్నాయన్నారు. వీరంతా పనులు లేక అర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారకి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పార్వతమ్మ స్పందిస్తూ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సహకారంతో అర్హులందరికీ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కంభం మండల విశ్వబ్రాహ్మణ సంఘం వారు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 10:15 PM