అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:38 AM
ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ స్పష్టం చేశారు. ‘ఉపాధి అక్రమాలపై ఉదాసీనత’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఒక ప్రకటనను విడుదల చేశారు.
డ్వామా పీడీ జోసఫ్‌కుమార్
దర్శి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ స్పష్టం చేశారు. ‘ఉపాధి అక్రమాలపై ఉదాసీనత’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఒక ప్రకటనను విడుదల చేశారు. దర్శి మండలంలో 2024-25లో జరిగిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక రెండు రోజులపాటు నిర్వహించామన్నారు. సామాజిక తనిఖీ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు నివేదికను కలెక్టర్‌కు సమర్పించామని చెప్పారు. సామాజిక తనిఖీ బృందం సమర్పించిన నివేదిక, సిబ్బంది సమర్పించిన ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకొని తీవ్రతను బట్టి కొంతమంది నుంచి రికవరీ, పెనాల్టీలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.