పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:01 PM
మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రజాప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్‌చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ముండ్లమూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రజాప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్‌చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పూరిమెట్లలో మొంథా తుఫా న్‌తో దెబ్బతిన్న మొక్కజొన్న, మిరప, కంది పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిచిన మొక్క జొన్నను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తొందరపడి దళారులకు అమ్ముకో వద్దన్నారు.
కార్యక్రమంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబరు నాగలపాటి నాగేశ్వరరాజు, సీపీఎం నాయకుడు బోడపాటి హనుమంతరావు, ఎంపీటీసీ చింతలపల్లి వెంకటేశ్వరరావు, నిడిగంటి నారాయణ, రమణాల ఏడుకొండలు, రమణాలవారిపాలెం మాజీ సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారులకు మెరుగైన సేవలు
ముండ్లమూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియో గదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్టు రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్‌చైర్మన్ మర్రెడ్డి శ్రీని వాసరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పూరిమెట్లలో నూతనంగా ఏర్పాటుచేసిన ట్రా న్స్‌ఫార్మర్‌ను ఆయన ప్రారంభిం చారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్ర భుత్వం అధి కారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో గ్రామాల్లో దీర్ఘకా లికంగా శిథిలావస్థలో ఉన్న స్తంభాలు మార్చి కొత్తవి ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌డీఎస్ పథకం ద్వారా పనులు ముమ్మరంగా జరుగు తున్నాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌చైర్మన్ కోడెగ మస్తాన్‌రావు, ఓగులూరి నాగేశ్వరరావు, తాని పర్తి నర్సారెడ్డి, చొప్పరపు నాగేశ్వరరావు, గోపీ, ఏరేసు చంద్రశేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.