రైతులను ఆదుకుంటాం
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:14 PM
రైతు లను ప్రభుత్వం ఆదుకుంటుందని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నా రు. శనివారం ఆమె మండలంలో పర్యటించారు. ముందుగా పడమరవీరాయపాలెం వద్ద కోతకు గురైన రోడ్డును పరిశీలించి అధికారులతో మా ట్లాడారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
కురిచేడు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రైతు లను ప్రభుత్వం ఆదుకుంటుందని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నా రు. శనివారం ఆమె మండలంలో పర్యటించారు. ముందుగా పడమరవీరాయపాలెం వద్ద కోతకు గురైన రోడ్డును పరిశీలించి అధికారులతో మా ట్లాడారు. వెంటనే అంచనాలు తయారుచేసి మ రమ్మతులు చేపట్టాలని సూచించారు. కురిచేడు వస్తుండగా వెంగాయపాలెం బీసీ కాలనీకి చెం దిన మహిళలు తమ గృహాలలోకి వచ్చిన నీటిని చూపారు. వర్షపు నీటిని వెంటనే తొలగించాల ని ఎంపీడీవోకు సూచించారు. దేనకొండ గ్రా మం వద్ద దెబ్బతిన్న పత్తి, పొగాకు తోటలను పరిశీలించి వ్యవసాయాధికారులతో మాట్లాడా రు. రైతులకు న్యాయం చేయాలని సూచించారు. సా మాజిక పింఛన్లనూ పంపిణీ చేశారు.
ఈసందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపు వల్లనే మొంథా తుఫాన్‌తో ప్రాణనష్టం జరగలేదన్నారు. వృద్ధులు, వితంతువులకు పిం ఛన్లు అందిస్తున్న ఘనత చం ద్రబాబుదేనని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భం గా పాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో టీడీపీ నియో జకవర్గ నాయకుడు కడియాల లలిత్‌సాగర్, పార్టీ మండల అధ్యక్షుడు పిడతల నెమిలయ్య, నాయకులు కాట్రాజు నాగరాజు, బొల్లేపల్లి ఆదినారాయణ, గొట్టిపా టి వెంకటేశ్వర్లు, కిలారి కొండయ్య, కాళ్ళ వెంకటేశ్వర్లు, బెల్లం సత్యనారాయణ, బాలయ్య, డిష్ వెంకటేశ్వర్లు, నరసింహా రావు, మక్కెన లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొ న్నారు.
పునరావాస బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
దర్శి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): తుఫాన్ సంద ర్భంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకొని గృహాలకు వెళ్తున్న నేపథ్యంలో శనివారం బాధితులకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నిత్యావ సర సరుకులు అందజేశారు. మండలంలో మొత్తం 57 మంది పునరావాస కేంద్రాల్లో మొంథా తుఫాన్ కార ణంగా తలదాచుకోగా వారికి రూ.3వేలు చొప్పున నగ దు. 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిగ డ్డలు, బంగాళదుంపలు, పంచదార పంపిణీ చేశారు. దర్శిలో జరిగిన ఈకార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి మాట్లా డుతూ సీఎం చంద్రబాబు అనుభవంతో భయంకర మైన తుఫాన్‌లో ఒక్క ప్రాణనష్టం జరగకుండా కాపా డటం జరిగిందన్నారు. వైసీపీ సైకోబ్యాచ్ తుఫాన్ బా ధితులకు అండగా నిలవటానికి బదులు తప్పుడు ప్రచారం చేయటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, తహసీల్దార్ ఎం.శ్రావణ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పి చ్చయ్య, కమిషనర్ వై.మహేశ్వ రరావు, టీడీపీ దర్శి ప ట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, మండల అధ్యక్షు డు మారెళ్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు: మొంథా తుఫాన్ పునరావాస బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుందని టీడీపీ మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మానం రమే్‌షబాబు తెలిపారు. తు ఫాన్ ప్రభావంతో పునరావాసం కల్పించిన బాధితులకు నిత్యావసర వస్తువులు, నష్టపరిహారం శనివారం అందజేశారు. తహసీల్దార్ బీవీ రమణారావు మాట్లాడుతూ మండలంలో ఏర్పాటుచేసిన నాలు గు పునరావాస కేంద్రాలందు తలదాల్చుకున్న 93 కుటుంబాలలోని 254 మందికి ప్రభుత్వం తుఫాన్ రిలీఫ్ ఫండ్ కింద రూ.2లక్షల 13 వేలు మంజూరు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్‌రెడ్డి, దర్శి మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ ఖాశీంసైదా, తదితరులు పాల్గొన్నారు.
దొనకొండ: తుఫాన్ కారణంగా పునరావాస కేంద్రంలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నగదు, నిత్యావసర సరుకులను తహసీల్దార్ బి. రమాదేవి శనివారం పంపిణీ చేశారు. భారీ వర్షాలకు దొనకొండలో లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ఐదు పేద కుటుంబాలను అధికారులు గుర్తించి ముందస్తు చర్యగా పునరావాస కేంద్రానికి తరలించి భోజన ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమంలో ఎంఈవో సాంబశివరావు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వర రావు, మోడి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.