Share News

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:14 PM

ఆర్యవైశ్యులకు అన్నివిధాలఆ అండగా ఉంటామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చెప్పారు. ఆదివారం స్థానిక శ్రీనివాస పద్మావతి కల్యాణ మండపంలో జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది.

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం
జిల్లా ఆర్యవైశ్య కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే జనార్దన్‌, టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ లక్ష్మి, మాజీ మంత్రులు శిద్దా రాఘవరావు, టీజే వెంకటేష్‌

- ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌

దర్శి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యులకు అన్నివిధాలఆ అండగా ఉంటామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ చెప్పారు. ఆదివారం స్థానిక శ్రీనివాస పద్మావతి కల్యాణ మండపంలో జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా బొగ్గవరపు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా మువ్వల శ్రీనివాసులు, కోశాధికారిగాఆర్‌.లక్ష్మీనర్సింహారావుతో పాటు నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. ఈసందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే జనార్దన్‌ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులను వ్యాపారాలు కూడా చేసుకోనివ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. కొంతమందిని బెదిరించటంతో పాటు అక్రమ కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. జ్రాఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులతో పాటు అన్నివర్గాల ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారన్నారు. ీ మంచి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ సహకారం అందించాలని కోరారు. టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు తమ సంపాదనలో కొంతభాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ప్రపంచవ్యాప్తంగా వాసవీమాత పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షుడు టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను అన్నివర్గాల ప్రజలు ఆదరించి గౌరవిస్తున్నారని చెప్పారు. ఆర్యవైశ్యులు కొంతమంది అమ్మవారి భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి దొంగల ఆటకట్టించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. కర్నూల్‌ అర్భన్‌ డెవల్‌పమెంట్‌ చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆర్యవైశ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధించటంతో వారికి తగిన గుణపాఠం చెప్పామన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, వైసీపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారని, అలాంటి దుష్టులకు ఆర్యవైశ్యులు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, వాసవీ సత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలు శిద్దా లక్ష్మీపద్మావతి, జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కోటా హనుమంతరావు, సూరె చిన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 11:14 PM