ప్రణాళికాబద్ధంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:30 PM
ప్రణాళి కాబద్ధంగా డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్క రిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అ న్నారు. పట్టణంలోని 15, 16వ వార్డుల్లో శనివా రం ఉదయం పర్యటించారు. నాగులుచెరువునూ సందర్శించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రణాళి కాబద్ధంగా డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్క రిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అ న్నారు. పట్టణంలోని 15, 16వ వార్డుల్లో శనివా రం ఉదయం పర్యటించారు. నాగులుచెరువునూ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ చెరువు కరకట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాకిం గ్ ట్రాక్ ఏర్పాటుతో పాటు ఆహ్లాదకరంగా ఉండే లా నీడనిచ్చే చెట్లను, సేద తీరేందుకు బెంచీలను ఏర్పాటుచేసేవిధంగా ప్రణాళికను సిద్ధం చేయను న్నట్టు చెప్పారు. పట్టణంలోని అలుగువాగులను, వంక లను రూట్ మ్యాప్ ద్వారా చెరువుకు అనుసంధానం చేసేవిధంగా చర్యలు చేపడతామన్నారు. వాగు ఆక్రమ ణలను తొలగించటంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
పట్టణంలో డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శు భ్రం చేసేవిధంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది మ రింత చొరవ వహించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పేర్కొన్నారు. డ్రైనేజీ కా లువలతో పాటు డంపింగ్ చేసే చెత్తకుప్పలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని ఆదేశించారు. అనంతరం నగరికంటి బసవయ్య సెంటర్ వద్ద నిర్మాణంలో ఉన్న శివాలయం షా పింగ్ కాంపెక్ల్స్ పనులను పరిశీలిం చారు. త్వరతగతిన నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించా రు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు ఫిరోజ్, బాలు ఓబులరెడ్డి, గం గవరపు నాగిరెడ్డి, బుల్లా బాల బాబు, సద్గురు, షరీఫ్, కేవీఎస్ గౌడ్, కొత్తూరు రవి, మారుతి, అద్దంకి రంగబాబు, కొ బ్బరి బొండాల సుబ్బారావు, బాలిరెడ్డి, తిరుమల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
2