గ్రానైట్ సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:02 PM
గ్రానైట్ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డు సమీపంలో రూ.2.14 కోట్లతో నిర్మించనున్న గనుల శాఖ కార్యాలయానికి ఆదివారం ఆయన జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామితో కలిసి భూమి పూజ చేశారు.
పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం
మంత్రి కొల్లు రవీంద్ర
ఒంగోలులో గనుల శాఖ భవన నిర్మాణానికి శంకుస్థాపన
ఒంగోలు క్రైం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గ్రానైట్ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డు సమీపంలో రూ.2.14 కోట్లతో నిర్మించనున్న గనుల శాఖ కార్యాలయానికి ఆదివారం ఆయన జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాయల్టీ వసూలు విషయంలో గ్రానైట్ పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ గనులను దోచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శకంగా మైనింగ్ పాలసీని అమల్లోకి తెచ్చారన్నారు. రాష్ట్రంలో ఇసుకకు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల విశాఖలో జరిగిన సదస్సులో రూ.13.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని అన్నారు. పరిశ్రమల స్థాపన వలన 17.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాది అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మాట్లాడుతూ ఒంగోలులో గనులు శాఖ కార్యాలయం నిర్మాణం వలన పారిశ్రామికవేత్తలకు మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు బీఎన్ విజయ్‌కుమార్,ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్ సత్య, నగర మేయర్ సుజాత, ఒడా చైర్మన్ రియాజ్, జేసీ గోపాలకృష్ణ, గనులశాఖ డీఎంజీ చంద్రశేఖర్, డీడీ రాజశేఖర్ పాల్గొన్నారు.