ప్రజావినతులను త్వరితగతిన పరిష్కరిస్తాం
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:39 PM
: ప్రజలు పలు సమస్యలపై అందచేసిన వినతులను త్వరతిగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజలు పలు సమస్యలపై అందచేసిన వినతులను త్వరతిగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అందజేసిన వినతులను పరిశీలిస్తామన్నారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపిస్తామని చెప్పారు. నిర్ణీత గడువులో అర్జీల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బార్‌లో 172అర్జీలు రాగా, వాటిలో ఎక్కువ శాతం ఇంటి నివేశ స్థలాలు కోసం వచ్చినట్లు తెలిపారు. కనిగిరి మండలం నుం చి 30 అర్జీలు, పామూరు నుంచి 9, పీసీపల్లి నుంచి 31, సీఎస్‌పురం నుంచి 21, వెలిగండ్ల నుంచి 14, హెచ్‌ఎంపాడు మండలం నుంచి 30 అర్జీలు వచ్చా యని డాక్టర్ ఉగ్ర తెలిపా రు. కనిగిరి మున్సిపాల్టీ నుంచి 37 అర్జీలు వచ్చి నట్టు చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొ న్నారు.