Share News

సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి అందజేస్తాం

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:13 PM

తుఫాన్‌ కారణంగా నష్టపోయిన పంటల వివరాలను సమగ్రంగా నమోదు చేసి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని ఉద్యాన శాఖాధికారి ఆదిరెడ్డి రైతులకు తెలిపారు.

సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి అందజేస్తాం

పంటల నష్టంపై ఉద్యాన శాఖాధికారి ఆదిరెడ్డి

పెద్ద దోర్నాల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : తుఫాన్‌ కారణంగా నష్టపోయిన పంటల వివరాలను సమగ్రంగా నమోదు చేసి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని ఉద్యాన శాఖాధికారి ఆదిరెడ్డి రైతులకు తెలిపారు. మండలంలోని నల్లగుంట్ల గ్రామంలో మొంథా తుఫాన్‌ వల్ల కురిసిన వర్షానికి అటవీ ప్రాంతం నుంచి ప్రవహించిన వరద నీటిలో నేటికీ ముం పులో ఉన్న మిరప తోటలను సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆంధ్రజ్యోతిలో పంటలను పరిశీలించండి ఆదుకోం డి శీర్షికన సోమవారం వచ్చిన కథనంపై స్పందించిన ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖాధికారి ఆదిరెడ్డి క్షేత్ర స్థాయిలో మి రప. బొప్పాయి పంటలను పరిశీలించా రు. ముంపు నుంచి పంటలు కాపాడుకునేందుకు అత్యవసరంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి ముంపు నుంచి ఇపుడిప్పుడే బయట పడిన, పడుతున్న కొన్ని పొలాల్లో మిరప మొక్కలను సరి చేసుకోవాలని, పొలంలో నీరు లేకుం డా చూడాలని, అనంతరం యూరియా, 19:19:19లేదా, 13-0-45 వంటి పోషకాలు కలిగిన మందులు పిచికారీ చేయాలని, వేరుకుళ్లు, కాండం తెగులు నివారణకు కాపర్‌ఆక్సిక్లోరైడ్‌ 3గ్రాములు లీటరు నీటికి వాడాలని, ఆకు మచ్చ తెగులుకు మ్యాంకోజబ్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీచేయాలని తదితర సూ చనలు చేశారు. మరో వైపు అధికారి సూ చనలపై బాధిత రైతులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. పది రోజులుగా నీటిలో ఉన్న మిరప మొక్కలు బతుకుతాయా, మళ్లీ మం దులు పిచికారీ చేస్తే అదనపు భారమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:13 PM